CM Revanth:కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం–ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

0
82

CM Revanth:

కేంద్రంలో ఇండియా కూటమి

– కాంగ్రెస్​కు పెరగనున్న ఓట్ల శాతం
–లోక్​సభ ఎన్నికలు మాకు రెఫరెండమే
–336 సీట్లలో పోటీ చేసిన బీజేపీ, 400 సీట్లు వస్తాయా?
–ఎవరు బడుగుల కోసం పనిచేస్తారో చర్చకు రెడీనా?

గత మూడు విడతల పోలింగ్​, నేడు జరుగుతున్న నాలుగో విడత పోలింగ్​ సరళిని పరిశీలిస్తే కేంద్రంలో ఇండియా కూటమి సర్కార్​ ఏర్పడడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అంటూ మరో మారు స్పష్టం చేశారు. కొడంగల్​లో కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్​ స్టేషన్​ బయట ​ మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు. సెప్టెంబర్ 17, 2025తో మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, ఆ పార్టీలో వయోపరిమితి అమలు చేసింది మోడీ నే అని, ఇదే పాటిస్తే బీజేపీ నుంచి ఎవరు ప్రధాని అనేది తేల్చుకోవాలని సూచించారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏ కు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీజేపీ దేశ వ్యాప్తంగా 336 లోక్​సభ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, అయితే 400 సీట్లు ఎట్లా సాధ్యం? అని సీఎం ప్రశ్నించారు. మోడీతో సహా బీజేపీ నేతలంగా ఈ సారి 400సీట్లు అంటున్నారని మండిపడ్డారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని దుయ్యబట్టారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవన్నారు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన సీఎం తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని దేశ వ్యాప్తంగా చెబుతున్న నరేంద్రమోడీతో పాటు బీజేపీ నేతలు, ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరిందని, అక్కడ ఇమాం, మోజంలకు జీతాలు పెంచడంతో పాటు ముస్లీంలకు రిజర్వేషన్లు పెంచుతామని మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. దీంతోనే .దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారని నిజమైందని మండిపడ్డారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే… మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఎద్దేవా చేశారు.ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దారో దీన్నిబట్టి తెలుస్తోందన్నారు.

ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్​ విసిరారు. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం తెలిపారు. మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవని ఆరోపించారు. ఆ పార్టీలో చేరిన నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ పై చర్యలు లేవు, బీజేపీ నేతలపై ఎంహెచ్​ఏ కూడా ఫిర్యాదు చేయరన్నారు., నీ ఒక వీడియో వైరల్ కేసులో మాపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగిందని మండిపడ్డారు. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనమని సీఎం తెలిపారు. బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా?అంటూ ఆరోపించారు.

కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా..ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండని డిమాండ్​ చేశారు. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేద. రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ సైతం అలానే చేసి తీరుతామని సీఎం మరో మారు ప్రకటించారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదు.పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం..రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి, పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందంటూ మరో మారు మండిపడ్డారు. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉందని, మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here