- జూన్ 9 న దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి జ్యోష్యం చెప్పారు. గురువారం కేరళ లోని వాయినాడ్ లో సీఎం మాట్లాడారు.ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు..తెలివైన వారు అని కొనియాడారు.
కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయి.. కానీ కేరళ అభివృద్ధి కాలేదు..
కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతి లో మునిగిపోయారు ..
బంగారం స్మగ్లింగ్ లో సీఎం విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది..
సీఎం విజయన్ పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా.. ఆయనపై మోదీ చర్యలు తీసుకోవడం లేదు…
ప్రధాని మోదీతో కేరళ సీఎం విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారు..
రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రం తో పోరాటం చేయాలి…
తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్ , ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రం తో నిధుల కోసం పోరాడుతున్నాయి..
కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదు…
పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడి గా కనిపిస్తున్న విజయన్ … కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు..
మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పని చేస్తున్నాడు..
వాయనాడ్ లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కి కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారు..
సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారు..
ఈడీ, ఆదాయపన్ను కేసులున్ననని రోజులు సీపీఎం పార్టీ కోసం విజయన్ పనిచేయరు…
మణిపూర్ లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గుండాల చేతిలో చనిపోయారు..
ప్రధాని మోదీ, అమిత్ షా మణిపూర్ లో పర్యటించలేదు.. కాని రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిశారు …
రాసిపెట్టుకోండి… జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధాని గా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం …
దేశంలో రెండు పరివార్ ల మధ్య పోరాటం జరుగుతోంది…
మోదీ పరివార్ లో ఈడీ,ఈవీఎం లు, సీబీఐ, ఇన్కంట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారు..
ఇండియా పరివార్ లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారు..
ఇందిరా ,రాజీవ్ లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు..
సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు..
వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారు..నేను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు..
రాహుల్ గాంధీ పై వాయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే నేను తెలంగాణ నుంచి వచ్చా…
తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీ ని కోరాం..
కానీ..వాయనాడ్ వైపే ఆయన మొగ్గు చూపారు..
గత ఎన్నికల్లో వాయనాడ్ లో 65 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ సారి 75 శాతం ఓట్లు రావాలి..
మోదీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం..
వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోంది…
వయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదు…దేశానికి కాబోయే ప్రధానికి..