ELECTION:
-పోలింగ్ ప్రశాంతం
-అర్థరాత్రి వరకు కొనసాగిన పోలింగ్
-పెరిగిన ఓటింగ్ శాతం
-సుమారు 65 శాతానికి చేరే అవకాశం
-ఎప్పటిలాగే ఓట్లు వేయడంలో వెనుకబడ్డ నగర ఓటర్లు
-2019లో ఓటింగ్ శాతం 62.77
లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సాయంత్రం 6 గంటల వరకు ఓట్లు వేయడానికి అవకాశమున్నప్పటికీ ఓటు వేసేందుకు కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకున్నప్పటికీ అర్థరాత్రి వరకు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఉదయం నుండి మందకోడిగా సాగిన పోలింగ్ సాయంత్రం వేళ ఒక్కసారిగా పెరిగింది. ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగి 65 శాతానికి చేరే అవకాశముందని రాజకీయ వర్గాలు, అధికారులు అంచనా వేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ లో ఓట్ల శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. 5 గంటల వరకు61.16 శాతంగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలంగాణలో పోలింగ్ గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువగా స్పందించారు. ముందుగా మందకోడిగా సాగినప్పటికీ సమయం గడుస్తున్న కొద్దీ ఓటింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుతీరారు. తెలంగాణలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.28శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు పురుషులకంటే కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయగా ఎన్నికల అధికారులు అప్పటికప్పుడు వాటిని మార్చి కొత్తవాటిని అమర్చి ఇబ్బందులు లేకుండా చూశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం లోని మారుమూల ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ముగించి ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నగర ఓటర్లు ఎప్పటి మాదిరిగానే ఓటు వేయడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు.
జి