EMCET: తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 27 నుండి ప్రారంభం కానుంది. ముందుగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్ ఎప్‌సెట్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పుడా అని చూస్తున్న తరుణంలో తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 27వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుండగా, జూన్ 30 నుంచి విద్యార్థులు మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం జులై 12వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఇక ఈసారి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో జరగనుంది. జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక రెండో విడత సీట్ల కేటాయింపు జులై 24వ తేదీన జరగనుంది. అలాగే తుది విడత కౌన్సెలింగ్‌ను జులై 30 వతేదీన నిర్వహించి, ఆగస్టు 5వ తేదీన చివరి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అలాగే ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఇక ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వెబ్ ఆప్షన్స్‌ను నమోదు చేసుకున్న విద్యార్థులకు జూన్ 30వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. జులై 9వ తేదీ నుంచి ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. వీరికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్ కన్వీనర్ ద్వారా చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. జులై 24లోపు అన్ని సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.