Heritage walk:
వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు.
ప్రపంచ హెరిటేజ్ దినోత్సవ సందర్భంగా జిహెచ్ఎంసి ఆద్వర్యంలో గురువారం దారుల్ షిఫా నుండి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ సాలార్ జాంగ్ మ్యూజియం మీదుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముగిసింది. హెరిటేజ్ వాక్ లో కమిషనర్ రోనాల్డ్ రోస్ తో పాటు జోనల్ కమిషనర్లు, హెచ్ ఓ డి లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ మాట్లాడుతూ…హైదరాబాద్ నగరంలో ప్రాముఖ్యత గల వారసత్వ సంపదను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నట్లు, వారసత్వ సంపదను బావితరాల వారికి అందించాలనే సంకల్పంతో చార్మినార్ పెడెస్ట్రెయిన్ ప్రాజెక్టు అభివృద్ది చేయడం జరిగిందన్నారు
జిహెచ్ఎంసి అధ్వర్యంలో 3 పురాతన భవనాలు పునర్నిర్మాణం, సుందరీకరణ కోసం రూ.18.33 కోట్ల వ్యయంతో మోజం జాహి మార్కెట్, మౌలాలి కామన్, క్లాక్ టవర్ పనులను పూర్తి చేయడం జరిగిందని,
చార్మినార్ పెడేస్త్రేయిన్ క్రింద చేపట్టిన వివిధ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
చార్మినార్ చుట్టున్న ఆరు కమాన్ లను పున:నిర్మాణ, పునరుద్ధరణ పనులకోసం ప్రతిపాదించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ముర్గి చౌక్, సర్దార్ మహల్ పనులు కూడా చేపట్టి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.
హెరిటేజ్ వాక్ లో 1908 లో మూసి వరదల సందర్భంగా నగరంలో చేపట్టే అభివృద్ధి నీ స్ఫూర్తి గా తీసుకొని ఈ వాక్ ను నిర్వహించడం జరిగిందని ఈ వాక్ సందర్భంగా పాత మున్సిపల్ భవనాన్ని అదే విధంగా సాలార్ జంగ్ మ్యూజియం గతంలో ఏ విధంగా ఉండే ప్రస్తుత ఏ విధంగా ఉందో ఫోటో ల ద్వారా చూడడం జరిగిందని హెరిటేజ్ నగరంలో ఉన్న ప్రాముఖ్యత పై ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పున:నిర్మాణ, పునరుద్ధరణ చేపట్టే ఆరు కమాన్ లు రాణీ గంజ్ కమాన్, షేక్ ఫెయిజ్ కమాన్, చట్ట బజార్ కమాన్, దీవాన్ డేవడి కమాన్, దబీర్పూర కమాన్, హుస్సేన్ అలం కమాన్లు అభివృద్ధి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ వాక్ లో జోనల్ కమిషనర్లు రవి కిరణ్, స్నేహ శబరిష్, అభిలాష అభినవ్, పంకజ, వెంకన్న, అడిషనల్ కమిషనర్ కె. శ్రీవాత్సవ్, చంద్రకాంత్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, చీఫ్ ఎంటమాలజి ఆఫీసర్ డాక్టర్ పద్మజ, డాక్టర్ అబ్దుల్ వాకిల్, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారిచేయడమైనది.