pepsi:రేవంత్ రెడ్డి, రాహూల్ గాంధీ లది సాహసోపేతమైన నిర్ణయం-పెప్సి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంగానిమల్లేశ్వర్

0
39

కులగణన ఆషామాషీ కాదు

మా వాటా మాకు కావాలి

ఎమ్మెల్సీ , ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి పెప్సీ క్యాలండర్ ను అవిష్కరిస్తున్న డాక్టర్ సంగాని మల్లేశ్వర్

pepsi:కులగణన వ్యవహారం ఆషామాషీ కాదని పెప్సీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా రాహూల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత తీర్మాణం చేసి అమలుకు పూనుకున్నారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కోదండరాం గారు అండగా నిలబడే భావజాలం కలిగిన వ్యక్తని కొనియాడారు. అనేక సంవత్సరాలుగా తాము వాటా కోసం ‘మేమెంతో మాకంత’ అని రోడ్ల మీదకు వెళ్లి పోరాటాలు చేశామన్నారు.మేమెంత ఉన్నామన్నది మాకు ఇప్పటికీ  తెలువలేదని, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 56 శాతం బీసీలు ఉన్నట్లు లీకులు మాత్రమే వచ్చాయన్నారు. స్పష్టత రాలేదని చెప్పారు. తమకు దామాషా ప్రకారం రావాల్సిన పదవులు,హక్కులు ఇప్పటికీ లభించలేదన్నారు. కులగణన ద్వారా  మా వాటా తేలితే భవిష్యత్తులో మాకు రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల పెప్సీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పెరిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here