కాంట్రాక్టరును కాపాడేందుకే సుంకిశాల ఘటనను ప్రభుత్వం దాచింది

క్రిమినల్ కేసు పెట్టాలి

సుంకిశాలను సందర్శించిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

(రాందేని చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు,7799563979)

Sunkishala project bjp:

మెఘా నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు కూలిపోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి సుంకిశాల ప్రాజెక్టును మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంట్రాక్టర్ మేఘ కృష్ణ రెడ్డి నీ కాపాడేందుకు సుంకిశాల ఘటనను ప్రభుత్వం దాచిందని ఆరోపించారు. తమ పర్మీషన్ లేకుండానే టన్నెల్ ఓపెన్ చేశారని అధికారులు చెబుతున్నారని తెలిపారు.ఇన్ని రోజులు గడుస్తున్న ప్రాజెక్ట్ ఎందుకు కూలిందో అంచనా వేయలేదని విమర్శించారు.మెఘా పై క్రిమినల్ నెగెలిజెన్స్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రులు చిన్న నష్టమే అంటున్నారని, రెండు వేల కోట్ల రూపాయలు వారికి చిన్నగా అనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. దీనిపై ఏ మంత్రి కూడా ఇక్కడికి వచ్చి సమీక్ష చేయలేదన్నారు.అరగంట ముందు ప్రమాదం జరిగి ఉంటే వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవన్నారు. ప్రాణాపాయం జరిగింది ఉంటే తెలంగాణ ఇజ్జత్ పోయేదన్నారు. మేఘ నాసిరకం పనులు చేస్తదని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ మాట్లాడారని,ఇప్పుడెందుకు మెఘా కి పనులు ఇస్తున్నారని ప్రశ్నించారు.కేంద్రం మెఘా కి నోటీసులు ఇస్తుంటే….మీరెందుకు మళ్ళీ మళ్ళీ పనులు అప్పజెప్టున్నారన్నారు.జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారని అన్నారు. కంపెనీ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారని అడిగారు. ఆ కంపెనీకి నష్ట పరిహారంతో పాటు ….క్రిమినల్ నెగలిజెన్సీ నమోదు చేయాలన్నారు.

ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది రోజులు ప్రమాదాన్ని ఎందుకు దాచారు ?ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎందుకు ఎస్కలెట్ చేసారు? .క్వాలిటీ నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇలాంటప్పుడు కంపెనీ నాసిరకం పనులు చేస్తే…బాధ్యులు ఎవరు? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ మెఘా కాంట్రాక్టర్ నెగ్లీజెన్స్ తోనే ప్రాజెక్ట్ కూలిందన్నారు.మా దగ్గర బ్రహ్మేశ్వర ప్రాజెక్ట్ కడుతున్నారని,అందులో కూడా నాసిరకం పనులు చేస్తున్నారన్నారు. మేఘ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు.బీ అర్ ఎస్ హయంలో జరిగిన అవినీతి నష్టం కాంగ్రెస్ హ యాంలో ఎందుకు బయటకు రావడం లేదన్నారు

.ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ఘటన ను ప్రభుత్వం గోప్యంగా ఉంచడం చాలా బాధాకరమన్నారు.ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం నోరు మెదపకుండా ఉంటడం బాధాకరమన్నారు.కాస్ట్ ఎస్కలేషన్ పెంచిన ప్రమాదం జరగడం దారుణమన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రెండవ టన్నెల్ ఎందుకు ఓపెన్ చేసారన్నారు.దీనిపై సీబీఐ ఎంక్వైరీ కి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలన్నారు.ఇందులో పారదర్శకత విచారణ జరగాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పజెప్పాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here