ఊసరవెల్లి రేవంత్​ రెడ్డిఅధికారం మీ అమ్మ నాన్న ఇవ్వలేదుఈటల రాజేందర్​

0
39

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఊరసవెల్లి మాటలు మాట్లాడుతున్నారని మల్చాజిగిరి బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్​ విమర్శించారు. మొదటిసారి వచ్చినప్పుడు మోదీ మా పెద్దన్న అన్నారు. ఇప్పుడు మోదీ గీడీ అని మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ ను ఓడగొట్టడానికి ప్రజలు నీకు అధికారం ఇచ్చారని, మీ అమ్మ నాన్న ఇచ్చినది కాదని గుర్తు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొని ఈట ల మాట్లాడారు. రేవంత్​ నువ్వు చిన్న మనిషివి బిడ్డా అని అన్నారు.మోదీ గారిని విమర్శించిన వారే ఏమైపోయారో చూశాం కదా అన్నారు. నీకు అదేగతి పడుతుందని జోస్యం చెప్పారు. మొన్న చిన్న ఎన్నికలు అని కాంగ్రెస్ కు వేశాం.. ఇప్పుడు పెద్ద ఎన్నికలు మోడీ కే వేస్తాం అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్ఎస్ లో పనిచేసిన నాయకులారా.. తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి ఓటు వేయండని పిలుపునిచ్చారు. బీజేపీ గెలిచే 400 స్థానాల్లో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండబోతుంది అని ఆయన అన్నారు. కేవలం నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా మోడీ ప్రభంజనం ఉందని నిరూపించబోతున్నామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here