ఏప్రిల్​ 1వ తేదీవరకు కేజ్రీవాల్ కు కస్టడీ తీహార్​ జైలు అధికారులపై ఎమ్మెల్సీ కవిత పిటీషన్​

0
129

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గ గడువు ముగియడంతో ఆయనను కోర్టు ఎదుట ఈడీ అధికారులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు ఈడీ తరపున వాదనలు రౌస్​ రోర్డులో జరిగాయి. ఈడీ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్‌ ఒకటి వరకు కేజ్రీవాల్​ కస్టడీని పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. మద్యం కేసులో అరెస్టైన కేసీఆర్​ తనయ ఎమ్మెల్సీ కవిత తీహార్​ జైలు అధికారులు తనకు సౌకర్యాలు కల్పించడం లేదని కోర్టులో పిటీషన్​ వేసింది. ఆరోగ్య సమస్యలున్నాయని ఔషదాలు అందివ్వడం లేదని పేర్కొంది. ఇంటి భోజనం అనుమతించడం లేదని , పూజ చేసుకోవడానికి జపమాల ఇవ్వడం లేదని ఆరోపించింది. పరుపులు, పెన్నులు, పుస్తకాలకు అనుమతి ఇవ్వడం లేదని పిటీషన్​ లో పేర్కొంది. పిటీషన్​ ను సోమవారం విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here