హంతకులకు ఓటు వేయవద్దు అధికారంలో ఉండి చిన్నాన్న హత్య కుట్రను చేధించలేదు ఏపీ ప్రజలకు వైఎస్ సునీతా రెడ్డి విజ్ఞప్తి

0
158

ఎన్నికల్లో హంతకులకు ఓటు వేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బంధుత్వాలకు అర్థం తెలుసా? – చిన్నాన్న అంటే నాన్నతో సమానం? – చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? – మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? – నాపైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా? అని ప్రశ్నించారు. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచింది – ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు? – ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదని చురకలంటించారు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే బయటకు రావాల్సి వచ్చిందన్నారు. నేను చెప్పేదంతా నిజం.. నాలాగే ఆయన చెప్పగలుగుతారా? అని అన్నారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని ఆయన అంటున్నారు ..వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. నిందితుల వెనక వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని అందరూ చెబుతున్నారు . మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారన్నారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరారు.. ఇప్పుడు మీరే వద్దన్నారు – మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా? అని అన్నారు. నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరడం దారుణమని అన్నారు. నిందితుడని సీబీఐ చెబుతున్నా ఓటు వేయాలని కోరుతున్నారు. మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు వేయాలని ప్రజలను కోరడం తప్పుగా అనిపించట్లేదా? అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తురాలేదు కానీ ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారు. సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారు – నేను పోరాడేది న్యాయం కోసం.. మీరు పోరాడేది పదవుల కోసమని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here