Prabhas:ప్రభాస్ కు గాయం, జపాన్ పర్యటనకు దూరం

0
7

Prabhas:అగ్రకథానాయకుడు ప్రభాస్‌ స్వల్పంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన కాలికి గాయమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా ఈ ఏడాది విడుదలైన బ్లాక్‌బస్టర్‌ ‘కల్కి 2898ఏడీ’ సినిమా.. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనాల్సివుంది. కానీ అనుకోకుండా ఆయన గాయపడటంతో జపాన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు.

మూవీ షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. అందుకే జపాన్ లో జరిగే కార్యక్రమానికి రాలేకపోతున్నాను. జపాన్‌లోని అభిమానులను ఎప్పట్నుంచో కలవాలనుకుంటున్నా. కానీ కుదర్లేదు.. క్షమించండి..’ అంటూ పోస్ట్‌ ద్వారా స్పందించారు ప్రభాస్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here