DILRAJU:క్షమాపణ చెప్పిన దిల్ రాజు

0
4

DILRAJU:అయితే తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై దిల్ రాజు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్షమాపణలు తెలిపాడు. అందరికీ నమస్కారం మొన్న‌ ఈ మధ్య నిజామాబాదులో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒక‌టి పెట్టాం మ‌ళ్లీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చేశాం. అంటే నిజామాబాద్‌తో నాకున్న అనుబంధం అలాంటిది నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేశాను. అయితే ఆ ఈవెంట్‌లో నేను మన కల్చర్‌లో ఉండే మన దావత్ గురించి మ‌ట‌న్ అలాగే తెల్ల క‌ల్లు గురించి సంబోధించాను. అయితే ఈ వ్యాఖ్య‌లు వివాదాస్పదం అవుతాయి అని అనుకోలేదు. తెలంగాణ మన కల్చర్ మన దావత్‌ని నేను మిస్ అవుతున్నాను. అందుకే అలా చెప్పాను.

అయితే ఈ మాట‌ల వ‌ల‌న మీరు ఇబ్బంది ప‌డి ఉంటే న‌న్ను క్షమించండి ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమాను చేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాను. ఈ సినిమా సాయిప‌ల్ల‌వి భానుమ‌తి పాత్ర‌తో పాటు తెలంగాణలో ఉండే కల్చర్‌ని ప్ర‌మోట్ చేసింది. తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎమోషన్స్‌కి ఎంత విలువ ఇస్తాం అనేది ఈ సినిమాలో చూపించాం. అలాగే రీసెంట్‌గా వచ్చిన బ‌ల‌గం సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హ‌త్తుకున్నారు. అన్ని రాజ‌కీయ పార్టీలు బ‌ల‌గం సినిమాను ప్ర‌శంసిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజి ద‌గ్గ‌రికి తీసుకెళ్లి అభినందించారు. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే.. ఒక తెలంగాణ వాసిగా తెలంగాణని అభిమానించే వ్య‌క్తిగా నేను తెలంగాణ ఎప్పుడు త‌క్కువ చేసి మాట్లాడ‌ను. ఈ విష‌యంలో మీ మ‌నోభావాలు దెబ్బ‌తింటే న‌న్ను క్ష‌మించండి. అంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.

నిర్మాణంలో వ‌స్తున్న‌ తాజా చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం. వెంక‌టేశ్ క‌థానాయ‌కుడిగా వ‌స్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే మూవీ విడుద‌ల సంద‌ర్బంగా దిల్ రాజు హోం టౌన్ అయిన నిజామాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వ‌హించారు మేక‌ర్స్. అయితే ఈ వేడుక‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. ఆంధ్రాలో సినిమాకు ఓ వైబ్ ఇస్తారు. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఇస్తాం. చలికాలం చెట్లలోకి పోయి కల్లు తాగుదాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదంగా మారడంతో పాటు తెలంగాణ ప్ర‌జ‌లంటే తాగుబోతులా అంటూ దిల్ రాజు అన‌డం క‌రెక్ట్ కాద‌ని ఈ విష‌యంలో దిల్ రాజు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here