Aramghar fly over:ఇది ఓల్డ్ సిటీ కాదు..ఓరిజినల్ సిటీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0
23

-ఫ్లైఓవర్ కు మన్మోహన్ సింగ్ పేరు

-రీజనల్ రింగ్ రోడ్డుతో తెలంగాణ మరింత అభివ్రుద్ది

-ఇది ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ.. ఒరిజినల్ హైదరాబాద్

Aramghar fly over:ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సీటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడారు. వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ వే నిర్మించుకున్నామన్నారు.మళ్లీ ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకుని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నామని స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు.ఆనాడు నిజాం హయాంలో ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ లను నిర్మించి హైదరాబాద్ తాగునీటి సమస్యను తీర్చారని, నేడు హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా మేం సిద్ధమని,హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామన్నారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, నగర అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతామన్నారు.రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు వెళుతుందని అన్నారు.

ఇది ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ.. ఒరిజినల్ హైదరాబాద్ అని అన్నారు.మిరాలం ట్యాంక్ పై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదే నన్నారు.త్వరలోనే గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here