CM REVANTH REDDY:బీజేపీ,బీఆర్ఎస్ ఒక్కటే- సీఎం రేవంత్ రెడ్డి

0
21

CM REVANTH REDDY:

-బిడ్డ కోసం బీజేపీ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్

-రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది

బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు బయటకు పోటీగా కనబడుతున్నా..రెండు పార్టీలు ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం నిజామాబాద్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను బీజేపీ మార్చుతామంటున్నదని కాపాడే బాధ్యత కాగ్రెస్ తీ.సుకుంటుందని హామీ ఇచ్చారు. మాట తప్పిన కవితను పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేశారని విమర్శించారు.ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అరవింద్ మోసం చేశారని అన్నారు.
చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలేదని ఆరోపించారు.ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడిన అరవింద్.. ఇవాళ వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నాడని. రాజ్యాంగాన్ని మారుస్తామన్నవారిని గద్దె దించాలన్నారు.

2021లో మోదీ జనగణన, కులగణన చేయలేదని రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు.రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయండని పిలుపు నిచ్చారు. ఇష్టారాజ్యంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూపోతే దేశంలో ప్రజస్వామ్యం బ్రతుకుతుందా? అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు.రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు.నరేంద్రమోదీ తెలంగాణకు ఇచ్చింది… బీజేపీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిదగుడ్డు తప్ప అని మరోసారి పునరుద్ఘాటించారు.గాడిదగుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని రాష్ట్రంలో బీజేపీని బొందపెట్టాలన్నారు.ఈ ఎన్నికల్లో నిజాయితీపరుడు, రైతు సమస్యలు తెలిసిన జీవన్ రెడ్డిని గెలిపించండని కోరారు. నిజామాబాద్ కు రింగ్ రోడ్డు వేయించే బాధ్యత మాది అన్నారు. బీసీ జనగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచే బాధ్యత మాది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు.

రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించాం.పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు ఉచితంగా అందిస్తున్నాం.గంజాయి, డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాం . అని రేవంత్ రెడ్డి అన్నారు.వంద రోజుల్లో ఇన్ని చేసిన కాంగ్రెస్ ను ఏం చేశారని కేసీఆర్ మాట్లాడుతుండని,బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్ల దగ్గర కేసీఆర్ తాకట్టు పెట్టారనిఆరోపించారు.నిజామాబాద్ అభివృద్ధికి నేను అండగా నిలబడతా.. మీరు జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండని కోరారు.మోదీ మనసునిండా రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనే ఉందన్నారు.కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here