GHMC: గ్రేటర్ లో రూ.14.67 కోట్లు సీజ్

0
70

GHMC:

-జిల్లాలో ఇప్పటి వరకు రూ.14,66,89,405/-
-నగదు సీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఇప్పటి వరకు రూ.14,66,89,405/- నగదుతో పాటు 6
కోట్ల 91లక్షల 14 వేల 291 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 20,955.15 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 210 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 
ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 433 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారని, 287 మంది పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు, లైసెన్సు గల 2,922
ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.ఎంసిసి ఉల్లంగనలపై 15 ఫిర్యాదులు అందగా,అన్నింటిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 3,11,200/-నగదు,
23,473/- రూపాయల విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 34.24 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, రెండు కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై ,4 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, 3 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు. రెండు లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 3,26,69,235/-, పోలీస్,ఐటి శాఖ ద్వారా రూ.11,24,40,480/-,
ఎస్ ఎస్ టి బృందాల ద్వారా రూ.15,79,690/- నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here