HMR: నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్

0
109

-నగరంలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్
-నెలలో అందుబాటులోకి రానున్న సేవలు
-రూ.80 కోట్లతో నిర్మాణం
-మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి
నగరంలోని నాంపల్లి ప్రాంతంలో మల్టీ లెవల్​ కార్​ పార్కింగ్​ కాంప్లెక్స్​ త్వరలో అందుబాటులోకి రానుంది. రూ.80 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. వచ్చే నెలలో దీని సేవలు అం దుబాటులోకి రానున్నాయి. ఇంజనీరింగ్​ అధికారులతో కలిసి మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి ఆదివారం మల్టిలేవెల్​ పార్కింగ్​ కాంప్లెక్స్​ పనులను పరిశీలించారు. పూర్తి ఆటోమేటెడ్​, కంప్యూటరైజ్డ్​ గా పనిచేసే ఈ పార్కింగ్​ విధానం దేశంలోనే అత్యున్నతమైనదిగా ఆయన వెల్లడించారు. పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మన దేశంలో ప్ర్రపథమంగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని ఎండి అన్నారు. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ కు సమీపంలో హెచ్ యం ఆర్ కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగుతుందని తెలిపారు. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్ర్కీన్ లతో కూడిన ఒక ఫిల్ము థియేటర్ ఉంటాయని అన్నారు.

మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వందల చదరపు అడుగుల నిర్మిత ఏరియాలో 68% పార్కింగ్ కోసం, మిగిలిన 32% వాణిజ్య సదుపాయాలకు కేటాయిస్తున్నామన్నారు. పార్కింగ్ జాగాలో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు నిలుపుదలజేసే అవకాశం వుంది. పిపిపి విధానంలో మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ 50 సంవత్సరాల రాయితీ కాలంతో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. కోవిడ్ తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాలు తదితర కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమైందన్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించామని, అతి త్వరలో ఆధునిక పార్కింగ్ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుందని ఎన్వీయస్ అన్నారు.
పార్క్ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి, డ్రైవర్ పార్కింగ్ రుసుము చెల్లించి, పార్కింగ్ టిక్కెట్‌ను కార్డ్ రీడర్‌కు చూపగానే, ట్రాన్స్ పోర్టర్-షటిల్ ఆటోమేటిక్‌గా కారును వాహనదారునికి అందజేస్తుంది. డ్రైవర్ కారుని రివర్స్ తిప్పుకోవల్సిన అవసరం లేకుండా అందజేయడమౌతుంది. పార్కింగ్ కోసం కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం, తిరిగి పొందడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుందని ఎన్వీయస్ అన్నారు. హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అధునిక పార్కింగ్ కాంప్లెక్స్ మన నగర కీర్తికిరీటంలో మరో కలికితురాయి కాగలదని, దేశంలో నూతన పార్కింగ్ విప్లవానికి ఈ ప్రాజెక్టు నాంది కాగలదని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here