KCR:కాంగ్రెస్ ది తలాతోక లేని పాలన-కేసీఆర్

0
23

KCR:

-కాంగ్రెస్ ది తలాతోక లేని పాలన
-మోదీ ఎజెండాలో పేదలుండరు

-750 మంది రైతులను చంపిన మోదీ

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తలా తోక లేని విధంగా తయరైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. బస్సుయాత్రలో భాగంగా నర్సాపూర్ లో రోడ్డుషో లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూయించి మనల మోసం చేసిన కాంగ్రెస్ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు.ఆరు గ్యారంటీలు 420 హమీలిచ్చి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపించారు.తొమ్మిదేండ్లు వచ్చిన కరెంటు మంచి నీళ్ళు ఇప్పుడెక్కడికి పోయినయన్నారు.బోనస్ బోగస్ అయిందన్నారు. రైతు బంధు నాట్లేసేటప్పుడు కాకుండా వొడ్లు కల్లాలకు వచ్చినప్పుడు ఇస్తామంటున్నారని ఇది విచిత్రంగా ఉందన్నారు. విద్యార్థులను రైతులను అన్ని వర్గాలను వంచించారన్నారు.కోమటిబండ నుంచి కాళేశ్వరం నీళ్లు వస్తే నర్సాపూర్ బంగారి తునక అయితదన్నారు.మల్లన్న సాగర్ నీళ్లు రావాలంటే ఎంపీ గా వెంకట్రామి రెడ్డి గెలువాలన్నారు.మున్సిపాలిటీకి గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుంటున్నారని అన్నారు.పేదల సంక్షేమం కొనసాగేటట్టు లేదన్నారు. ప్రతిదానికీ కొండి పెడుతున్నారని ఆరోపించారు.రాహుల్ల్ వచ్చిందంటుండు 2500 మహిళలకు వచ్చిందా అని అడిగారు.మదన్ రెడ్డి కాంగ్రెస్ లకు ఎందుకు పోయిండని, మీకు తన చరిత్ర మదన్ రెడ్డి చరిత్ర తెలుసన్నారు.

ముసలితనానికి కుసుమ గుడాలన్నట్టు మనలను విడిసిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.కాంగ్రెస్ మెడలు వంచి కాలువ పని పూర్తి చేస్కొని నీళ్లు తేవాలంటే ఎంపీ గా మన వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు.నరేంద్ర మోడీ 150 నినాదాలు ఇచ్చాడు కానీ ఒక్కటి కాలేదన్నారు. మోడీ ఎజెండాలో పేద లుండరని అన్నారు.ఢిల్లీలో 750 రైతులను సంపినోడు మోదీ అని ఆరోపించారు.మేధావులకు యువతకు ఆలోచనపరులకు మనవి..ఆలోచన చేసి ఓటు వేయండని అన్నారు.తండాలను గ్రామ పంచాయితీలని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. పదిశాతం రిజర్వేషన్లను ఎస్టీలకు అమలుచేసినామని,ఇప్పుడున్న ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల మీద కేసుంటే కోర్టులో ఎందుకు కొట్లాడట్లేదన్నారు.

పొడు భూములకు మనం పట్టాలిచ్చి రైతుబంధు ఇచ్చుకున్నామన్నారు.ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తాలేదన్నారు.మనందరం యుద్ధం చేస్తే తప్ప ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితి కనిపిస్తాలేదన్నారు.కృష్ణా నీళ్లు రావాలన్న తెలంగాణ ఆత్మగౌరవం నిలవాలన్నా బీఆర్ ఎస్ ఎంపీ గెలువాలన్నారు.తెలంగాణ లో మొత్తం ఎంపి లకన్నా ఎక్కువ మెజారిటీ తో వెంకట్రామిరెడ్డి గెలుస్తున్నాడని తనకు నివేదిక అందిందని అన్నారు.మీరందరూ ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here