KCR:
తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. కవిత ఎలాంటి తప్పు చేయలేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.
రాజకీయంగా కక్ష సాధింపు కోసమే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు. కవిత లిక్కర్ స్కామ్ పై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని కామెంట్ చేశారు.
” ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి మోదీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు. మోదీ దుర్మార్గుడు” అని కేసీఆర్ విరుచుకుపడ్డారు.