Kishanreddy:రేవంత్​ రెడ్డిది మిడిమిడి బుద్ది–కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

0
133

Kishan reddy :

రాహూల్​ గాంధీ ఉన్నన్ని రోజులు బీజేపీ విజయానికి ఢోకాలేదు
రేవంత్​ రెడ్డి మిడిమిడి జ్క్షానంతో మాట్లాడుతున్నారు
మజ్లిస్​ కాంగ్రెస్​ కోసం పనిచేసింది
కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

రాహుల్​ గాంధీ కాంగ్రెస్​ పార్టీకీ నేతృత్వం వహించినన్నీ రోజులు బీజేపీ విజయానికి ఢోకాలేదని కేంద్రమంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయం ముగిసాక బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్క్షానంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన మాటలు చూసి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు ఆయనను నమ్మడం లేదన్నారు. పట్టణప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఓటింగ్ తగ్గటానికి చాలా కారణాలున్నాయని,చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్లడం, తదితర కారణాలతో నగరంలో ఓటింగ్ తగ్గిందని తెలుస్తోంది. వేర్వేరు రాజకీయ పార్టీల ప్రజలు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కాదన్నారు.తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం, ఇలాంటి దేశంలో ఎన్నికలు పండగలాంటివన్నారు. అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటేశారని, హైదరాబాద్ లో సెలబ్రిటీలు కూడా క్యూలో నిలుచుని ఓటేయం మంచి సందేశమని అన్నారు. ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం బలపడటానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రజలనుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. గ్రామీణప్రాంతాల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా..మోదీ గారికి అండగా నిలిచారన్నారు.2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు.యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కుటిలయత్నాలను ప్రజలు పట్టించుకోలేదన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలే వీరి మాటలను సీరియస్ గా తీసుకోలేదని ఎద్దేవా చేశారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీకి అనుకూలంగా ఉందని భావిస్తున్నానని అన్నారు,.మేము ముందుగా చెప్పినట్లుగా.. ఈ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయన్నారు.బీజేపీ అభ్యర్థులపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేశారన్నారు. వీటిని ప్రజలు పట్టించుకోలేదన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు వారి నాయకుల మాటలను పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు బండిసంజయ్ నేతృత్వంలో వివిధ యాత్రలు చేశామన్నారు. .ఇవాళ జరిగిన పోలింగ్‌తో బీజేపీ తెలంగాణలో కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రతిఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని అన్నారు.సమ్మక్క, సారక్క యూనివర్సిటీ, పసుపుబోర్డు, టెక్స్‌టైల్ బోర్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను మోదీ తెలంగాణకు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే వీటిని మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని వెల్లడించారు.సమ్మక్క సారక్క యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ లో ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభించుకోబోతున్నామన్నారు.చిన్న చిన్న భూ సమస్యలున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తే.. శాశ్వత క్యాంపస్ నిర్మాణం ప్రారంభించుకుంటామని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారు. ప్రతిదానికి మోదీ గారిని చాలెంజ్ చేస్తున్నారని ఎ ద్దేవా చేశారు. వాళ్ల నాయకుడికే స్థిరత్వం లేదు. వాళ్లు మిమ్మల్ని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ఎవరైనా తమ స్థాయిని చూసుకుని సవాల్ విసిరితే బాగుంటుందన్నారు.ఎవరేందనేది జూన్ 4న తెలిసిపోతుందని అన్నారు. డబ్బులు ఖర్చుపెడితే, దుష్ప్రచారం చేస్తే.. ప్రజలు హర్షించరని విమర్శించారు. ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్ లో బీజేపీ విజయం సాధిస్తుంది. అందులో అనుమానం లేదని స్పష్టం చేశారు. అర్బన్ ఏరియాలో ఓటరు లిస్టుకు సంబంధించిన సంస్కరణలు జరగాలన్నారు. ఓటరు లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలన్నారు.కాంగ్రెస్ పార్టీకోసం మజ్లిస్ కార్యకర్తలు పనిచేశారని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here