KTR:రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
19

KTR:

-కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఫ్యాక్షనిజం

-కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ కు ఓటేయ్యద్దు

రాష్ట్రంలో ఇప్పడు భట్టి, రేవంత్, ఉత్తమ్ అంటూ (BRU) బ్రూ ట్యాక్స్ మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.భట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ పేరుతో మూడు రకాల ట్యాక్స్ లు వేస్తున్నారని అన్నారు. ఈ సామంత రాజులు ఢిల్లీకి కప్పం కట్టాలె కదా? అని అన్నారు.వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. జనవరి లో ఆర్మీ మాజీ సైనికుడు, బీఆర్ఎస్ నాయకుడు మల్లేష్ యాదవ్ ను చంపేశారని, కొల్లాపూర్ లో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని మొన్న చంపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు నెలల్లో ఇద్దరిని హత్య చేశారన్నారు, తెలంగాణ లో గతంలో ఎప్పుడు ఈ గొడ్డళ్లతో చంపుకునే సంస్కృతి లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ వచ్చాక పచ్చగా ఉన్న తెలంగాణలో ఫ్యాక్షనిజం హత్యలు మొదలయ్యాయని అన్నారు.ఐతే చంపాలె. …లేదంటే ఏదైనా కేసులు పెట్టి అవతలి వాళ్లను వేధించాలె అని ధ్వజమెత్తారు.మార్పు అనుకుంటే ప్రశాంతత పోయి హత్యలు జరిగే పరిస్థితి వచ్చిందన్నారు.కేయూ, ఓయూ విద్యార్థుల విషయంలో నేను ఏదో అన్నానంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.కేయూ, ఓయూ విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉందా? అని ప్రశ్నించారు. కేయూ, ఓయూ విద్యార్థుల్లో ఒక్కరికైనా కాంగ్రెస్ చట్టసభల్లో అవకాశం ఇచ్చిందా? అన్నారు.

ఆరు నెలల నుండి కాంగ్రెసోళ్లు ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపిస్తున్నారని మోసపోవద్దని చెప్పామన్నారు.కేసీఆర్ ఉన్నప్పుడు కడుపు నిండా కరెంట్ ఉంటుండే. అన్నారు.ఇప్పుడు ట్రాన్స్ ఫార్మర్లు కాలుడు, కరెంట్ కోతలు, పంటలు ఎండుడు అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన వారికి కూడా డిసెంబర్ 9 నాడు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన హామీ ఇచ్చి ఆరు నెలలు కావస్తోంది. మరి ఎవరికైనా రుణమాఫీ అయ్యిందా? అన్నారు. క్వింటాల్ వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడు మాట మార్చారన్నారు.100 రోజుల్లో ఆరు గ్యారంటీలు ఎమయ్యాయని ప్రశ్నించారు.కళ్యాణ లక్ష్మి పేరుతో కేసీఆర్ లక్షనే ఇస్తున్నాడు…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లక్షతో పాటు తులం బంగారం అందిస్తానని అన్నారు. మరి ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చాక లక్షన్నర పెళ్లిళ్లు జరిగాయి. లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడని చెప్పారు.తులం బంగారం కాదు కదా…తులం ఇనుము కూడా ఇవ్వడని చెప్పారు, ఒక్క నోటిఫికేషన్ లేదు, రాత పరీక్ష లేదు. కానీ 30 వేల ఉద్యోగాలు మాత్రం ఇచ్చేసిండంట అని ఎద్దేవా చేశారు.చూ మంతర్, అబ్రకదబ్ర అని 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉన్నాడు. సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నాడని అన్నారు. అసలు రేవంత్ రెడ్డి కాలేజ్ కు పోయిండా? ఏమైనా చదువుకున్నాడా? అని అనుమానం వ్యక్తం చేశాడు. తాను రెండు మాస్టర్ డిగ్రీలు చేసినా? నాకు తెలిసి నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రావని అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలె అని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు హామీ మాత్రమే అమలు చేశారని అన్నారు.దాని కారణంగా కూడా ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.గ్రాడ్యుయేట్లకు మంచి ప్రతినిధిగా ఉండాలని కేసీఆర్ రాకేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారన్నారు.అలాంటి రైతుబిడ్డ…చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ మన అభ్యర్థి అని అన్నారు. మరి కాంగ్రెస్ వాళ్లు ఎలాంటి అభ్యర్థిని ఎంపిక చేశారో తెలుసా?.ఆయన మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 74 రోజులు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. ఆయన అఫిడవిట్ లో ఈ అంశాలు ఉన్నాయన్నారు.ఆయనేమీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లలేదని లంగ పనులు చేసి జైలుకు పోయిండని అన్నారు. అటువంటి బ్యాక్ మెయిలర్ కు ఓటెయ్యద్దని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here