Loksabha:
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు, నేతలు
ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ కుటుంబ సమేతంగా ఆయన వెళ్లి ఓటు వేశారు. జిల్లా పరిషత్ స్కూలులోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం స్థానికులతో మాట్లాడారు. ఈ సంరద్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ స్థానంలో తాము గెలవబోతున్నామన్నారు. సంక్షేమ పథకాలకు, ప్రభుత్వానికి ఈ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు.అనంతరం గ్రామస్తులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
చింతమడకలో కేసీఆర్…
సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని పేర్కొన్నారు.