MURDER:కాకినాడ జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

0
7

MURDER:కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య చిన్న గొడవ హత్యలకు దారితీసింది. కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు.

గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒక మహిళ విషయమై.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మొదలైంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై మరొక కుటుంబం కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బత్తుల రమేశ్‌, బత్తుల చిన్ని, బత్తుల రాజులు చనిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన ఈ ఊరికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల్ని మోహరించారు. దీపావళి పండుగరోజే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here