NEW ENERGY POLICY:ఈనెల 9 న  న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన

0
12

జెన్కో ఏ ఈ లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

NEW ENERGY POLICY:దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రజా ప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్లానింగ్ శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని  రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది AE లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన  కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. గత పది సంవత్సరాలు పాలన చేసిన గత ప్రభుత్వం రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను మిగులు విద్యుత్తు ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు అందులో భాగంగానే నూతన ఎనర్జీ పాలసీని తీసుకురావడం వల్ల దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉండటంతో ఈ నెల నాలుగున జరిగిన క్యాబినెట్ సమావేశంలో న్యూ ఎనర్జీ పాలసీని ఆమోదించామని వివరించారు. దేశంలో ఇతర రాష్ట్రాల అమలు చేస్తున్న ఎనర్జీ పాలసీ తో పాటు మన రాష్ట్రంలో అందుబాటులో రెనేవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అన్ని అంశాలను అధ్యయనం చేసి న్యూ ఎనర్జీ పాలసీని తయారు చేసినట్లు చెప్పారు. 2030 సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్రానికి కావలసిన గరిష్ట విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు వెళుతున్నదని వివరించారు. అదే విధంగా ట్రాన్స్ మిషన్ వ్యవస్థను కూడా అందుకు తగ్గట్టుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ నీ ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్రణాళికను తయారు చేసుకుని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. రామగుండంలో జెన్కో సింగరేణి సంస్థ కాలరీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న నైనీ బ్లాకును గాలికి వదిలేసి పట్టించుకోలేదన్నారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న నేను ఒరిస్సా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు నిర్వహించి ముఖ్యమంత్రిని కలిసి సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్ ను అప్పగించామన్నారు. నైని కోల్ బ్లాకు పక్కనే థర్మల్ పవర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర జిఎస్డిపపి పెరగడానికి ఎనర్జీ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తున్నదని చెప్పారు.‌ నిమిషము అంతరాయం లేకుండా గత సంవత్సరం నుంచి నాణ్యత విద్యుత్తును ప్రజా ప్రభుత్వం సరఫరా చేస్తున్నదన్నారు. సోషల్ మీడియా తమకు అనుకూలంగా ఉండే పత్రికలు చేతుల్లో ఉన్నాయని బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పాలనలో కరెంటు లేకుండా పోతుందని  చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదన్నారు. ఖమ్మంలో ఇటీవల వరదలు సంభవించిన సమయంలో కరెంటు అంతరాయం లేకుండా నిరంతరంగా అందించడానికి వరద నీటిలో వర్షం పడుతున్న కరెంటు స్తంభాలు ఎక్కుతూ అర్ధరాత్రులు కూడా అంకితభావంతో విద్యుత్తు సిబ్బంది ఉద్యోగులు పనిచేశారని గుర్తు చేస్తూ వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోతున్నదని చెప్పారు. కొలువుల కోసం కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను  గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసిన బిఆర్ఎస్ పాలకులు అడియాశలు చేశారని అన్నారు. కొలువుల కోసం టిఆర్ఎస్ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగులకు తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులు పోరాటం చేసి అలసిపోయారని వారి వయసు కూడా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పది సంవత్సరాలు కొలువులు లేక నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగ యువత ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తి ప్రక్షాళన చేశామన్నారు. 

యూపీఎస్సీ తరహాలో
ఉద్యోగ నోటిఫికేషన్ల నియామకానికి ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా ఇలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఇప్పటికీ 56000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందన్నారు. ప్రతి నెల ఏదో ఒక చోట నియామక పత్రాలు అందజేస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత, టెక్నాలజీని ఈ దేశానికి తీసుకువచ్చి 21 శతాబ్దంలోకి ఈ దేశాన్ని సాంకేతిక రంగంలో  తీసుకువెళ్లిన స్ఫూర్తి ప్రదాత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కో ఏయలుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

చెమట చుక్కలకు తర్ఫీదు లోగో ఆవిష్కరణ
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన చెమట చుక్కలకు తర్ఫీద్ లోగోను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్య ఉపాధి అవకాశాలపై అవగాహన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కోల్బెల్టు యువతను నిలిపే ప్రయత్నం చేస్తున్న సింగరేణి సంస్థ యజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ , ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, సింగరేణి సి.ఎం.డి బలరాం నాయక్ జెన్కో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here