psudo: నకిలీ ఎస్ఐ అరెస్ట్

0
92

Psudo :

పోలీసు అధికారినని చెప్పుకుంటూ మోసం చేస్తున్న వ్యక్తిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై డ్రెస్ వేసుకుని పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలుకుతూ డబ్బులు వసూలు చేస్తుండటంతో వల పన్ని పట్టుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం ప్రాంతంలోని దొంతికుంట తండాకు చెందిన కడావత్ సోమ్లా నాయక్ బంజారాహిల్స్ లో నివాసముంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన సోమ్లానాయక్ మొదట ఆర్మీకి ఎంపికై శిక్షణ పొందాడు. 6 నెలల తర్వాత అక్కడి నుండి చెప్పకుండా వచ్చేశాడు. అనంతరం అస్సాం రైఫిల్స్ కు ఎంపికయ్యాడు. శిక్షణ సమయంలో హైడ్రోసిల్ సమస్య రావడంతో శిక్షణ మధ్యలో బయటకు వచ్చాడు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. రాకపోవడంతో పోలీసు డ్రెస్సు మీద ఉన్న ప్రేమతో ఎస్సై డ్రెస్ వేసుకుని కార్యక్రమాలకు వెళ్లేవాడు. ఇదే క్రమంలో లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని 11 లక్షల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేసి మాసబ్ ట్యాంకు పోలీసులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here