Rajnath singh :ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం :రాజనాథ్ సింగ్,

0
33

-Rajnath singh :కాంగ్రెస్, బీఆర్​ఎస్​ రెండూ అవినీతి పార్టీలే
-బీజేపీ ది అవినీతి రహిత ప్రభుత్వం
-ఆర్టికల్ 370 రద్దు చేశాం.. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు స్వేచ్ఛగాఉంది.
-ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం, సీఏఏ తీసుకువచ్చాం
-రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్​ సింగ్
బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు అత్యంత అవినీతి వంతమైనవని రక్షణశాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ అన్నారు. బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి నామినేషన్​ సందర్భంగా నగరానికి వచ్చిన కేంద్రమంత్రి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత పదేళ్ళలో బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని , మోడీ పాలనలో అవినీతికి ఆస్కారం లేదన్నారు. ఆర్టికల్​ 370 రద్దు చేసి జమ్ము కాశ్మీర్​ ప్రజలు దేశంలో స్వేఛ్చగా బతుకుతున్నారని వెల్లడించారు. ట్రిపుల్ తలాక్​ రద్దు చేశామని, సీఏఏ తీసుకువచ్చిన ఘనత బీజేపీదన్నారు.కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎలా డెవలప్మెంట్ అయ్యిందో చూస్తున్నామన్నారు. కిషన్ రెడ్డి అందరిలా కాదు.. ఆయన అవినీతి నాయకుడు కాదని అన్నారు. అనేకమంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామనని ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతున్నామని తెలిపారు. 2047 లోపు దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. మా ప్రభుత్వం వచ్చాకే అయోధ్య రామ మందిరం కట్టామని రామ రాజ్యం వచ్చిందన్నారు.బీజేపీ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే.. అక్కడ మన విద్యార్థులు ఉన్నారని, రెండు దేశాలతో మాట్లాడి.. యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకోచ్చిన ఘనత మోడీ దాని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తీసుకువచ్చామని క్లారిటీ ఇచ్చారు. కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదన్నారు.గతంలో 33% కాంగ్రెస్ రిజ్వరేషన్ ఇస్తామని అన్నారు కానీ ఇవ్వలేదు మోడీ గారు చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. దేశం ఇప్పుడు అత్యంత శక్తి వంతమైనదిగా అవతరించిందన్నారు. రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తివంతంగా తయారు చేసామన్నారు. కిషన్ రెడ్డి నాతో పాటు పని చేశారు మీ సమస్యలను.. మీ ఆలోచనలు కిషన్ రెడ్డి పార్లమెంట్ లో వినిపిస్తారని తెలిపారు. కిషన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఈటెలను గెలిపించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఈటల బీఆర్ఎస్ అవినీతిని చూసి బయటకు వచ్చేశాడని తెలిపారు.

కేంద్రమంత్రి,బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగావచ్చిన భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు ధన్యావాదాలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేయడం జరిగిందని, ఆ తర్వాత కేబినెట్ మినిస్టర్ గా మరో మూడు రకాల బాధ్యతలు కల్పించారన్నారు.నాకు ఓటేసిన ప్రజలు తలదించుకునేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదు.. ఏ విషయంలోనూ పొరపాటు చేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ప్రజాప్రతినిధిగా పనిచేశానన్నారు. మరోసారి నన్ను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని కార్యకర్తలు, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో సికింద్రాబాద్ అభివృద్ధి కోసం, సికింద్రాబాద్ ప్రజల వాణిని వినిపిస్తూ సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను ఎయిర్ పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు కూడా ఎవ్వరిపై దౌర్జన్యాలు చేయలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి ఇండ్లు ఖాళీ చేయించలే, ఎవరి భూమి ఆక్రమించుకోలేదు.. ఆక్రమణలను ప్రోత్సహించలేదు.. ఎక్కడా దౌర్జన్యాలు చేయలే, అక్రమ కేసులు పెట్టలేదు.. ఎవరి పట్ల వివక్షత చూపెట్టకుండా నైతిక విలువలకు కట్టుబడి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేశానన్నారు.భవిష్యత్తులోనూ అదే క్రమశిక్షణతో సికింద్రాబాద్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను. 17 సీట్లు తెలంగాణలో గెలిపించాలని కోరారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతఊకేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ గారు కిషన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు.నామినేషన్ ర్యాలీ విజయోత్సవ సభలా కనిపించిందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి గెలుపు ఇప్పటికే నిర్ధారణ అయిందన్నారు.ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు సౌమ్యానికి, సంస్కారాన్ని భారతీయ జనతా పార్టీకి వారసత్వంగా ఇచ్చారని అన్నారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారిని మరోసారి అద్భుత మెజారిటీతో గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here