Smuglers :ముగ్గురు స్మగ్లర్స్ అరెస్ట్

0
82

డ్రగ్స్​ విక్రయిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బెంగళూరులో నైజీరియన్ల నుంచి డ్రగ్స్​ కొనుగోలు చేసి హైదరాబాద్​ లో విక్రయిస్తుండగా ఈస్ట్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను గురువారం మీడియాకు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మిపెరుమాల్‌ వెల్లడించారు,. మెహిదీపట్నంకు చెందిన మాన్‌ సింగ్‌ బాట్లా అలియాస్‌ తేజ డిగ్రీ వరకు చదివి, చెఫ్‌గా పనిచేశాడు. తరుచు తన కాలేజీ స్కూల్‌ ఫ్రెండ్స్‌ను కలుస్తుండేవాడు. ఆ సమయంలో తన సీనియర్స్‌ గంజాయి తీసుకుంటూ కన్పించేవారు. అప్పటికే రెండు కేసులలో జైలుకు వెళ్లి వచ్చిన మాన్‌సింగ్‌, ఆ తరువాత హెల్త్‌ కేర్‌ కన్సల్టెంట్‌గా చేరాడు. ఆ తరువాత టోలిచౌక్‌కు చెందిన సయ్యద్‌ ఓబైద్‌, షబ్బీర్‌ హుస్సేన్‌లను కలుసుకొని తన ఫ్లాన్‌ను వివరించాడు. దీంతో ఇద్దరు డ్రగ్స్‌ హైదరాబాద్‌లో విక్రయించేందుకు అంగీకరించారు. ఇందులోభాగంగానే బెంగళూర్‌లోని యశ్వంత్‌పూర్‌లో ఉన్న ఒక నైజీరియన్‌ వద్దకు వెళ్లి అక్కడి నుంచి 7 గ్రాముల హెరాయిన్‌తో మాన్‌సింగ్‌ హైదరాబాద్‌కు వచ్చాడు. బెంగళూర్‌ నుంచి రాగానే మిగతా ఇద్దరు సయ్యద్‌ ఒబైద్‌, షబ్బార్‌ హుస్సేన్‌లను రేతిబౌలిలో కలిశాడు. సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌, గుడిమల్కాపూర్‌ పోలీసులతో కలిసి ముగ్గురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 7 గ్రాముల హెరాయిన్‌, ఫోన్లు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here