VHP:హిందువులపై దాడిని సహించం – భజరంగ్ దళ్

0
130

VHP:

-హిందువులపై దాడిని సహించం
-కాంగ్రెస్​ పాలనలో రజాకారుల ప్రవర్తన
బజరంగ్ దళ్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని భజరంగ్ దళ్ హెచ్చరించింది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ గారు, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ప్రెస్​ క్లబ్​లో మీడియాతో శుక్రవారం మాట్లాడారు.రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని ఆందోళన వ్యక్తం చేశారు. మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ప్రజలు రాజకీయాలతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని సంకేతాలు అందుతున్నాయన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఈ సందర్బంగా ఆవిష్కరించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here