అజ్ఞాతంలో వ్యాపారులు రాధాకిషన్​రావు ఆరెస్ట్​లో బేగంబజార్​లో కలకలం

0
163

హైదరాబాద్​: ఫోన్​ట్యాపింగ్​ వ్యవహారంలో ముఖ్యమంత్రి సమీప బంధువు, అప్పటి డీసీపీ(ఓఎస్​డీ)రాధాకిషన్‌రావు ను సిట్​ ఆరెస్ట్​ చేసి విచారిస్తున్నట్లు తెలిసిన వెంటనే బేగంబజార్​ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్రమ దందా సాగిస్తున్న పలువురి వ్యాపారుల ఫోన్లు ట్యాప్​ రాధాకిషన్​రావు భారీ ఎత్తున లావాదేవీలు నడిపినట్లు తెలుస్తోంది. అయితే బేగంబజార్​లో అక్రమ దండా నెరిపిన కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో హవాలా, గంజాయి దందాల్లో ప్రమేయమున్న వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసేవారు. ఈ నేపథ్యంలోనే వారితో ఆర్థిక లావాదేవీల బంధం కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. రాధాకిషన్​రావును విచారిస్తున్న సమాచారం తెలుసుకొన్న కొంత మంది వ్యాపారులు తమను కూడా విచారిస్తారన్న భయాందోళనలు పుట్టుకున్నాయి. తాము నెరిపిన అక్రమ దందా బయటపడకుండా భారీ ఎత్తున డబ్బులు సైతం ఇచ్చామని, విచారణలో ఆయన నోరు తెరిస్తే తమ పని గోవిందా అంటూ వ్యాపారులు తమ దుకాణాలను మూసి వేసి అజ్ఞాతంలోకి జారుకున్నట్లు సమాచారం. బేగంబజార్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ దందా కొనసాగించిన వ్యాపారులతో పాటు ముఖ్యంగా బంగారు దుకాణాల యాజమానుల నుంచి సైతం భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపనలున్నాయి. అయితే ముఖ్యమంత్రి దగ్గరి బంధువు కావడంతో రాష్ట్ర పోలీసులశాఖలో ఆయనకు ఎదురు చెప్పే వారు ఎవరు లేరన్నారు. దీంతో మరింత రెచ్చిపోయి రాధాకిషన్​రావు అక్రమ వసూళ్ల దందాకు తెరలేపారని, కొంత మంది వ్యాపారులతో బీఆర్​ఎస్​ పార్టీకి సైతం చందాలుగా ఇచ్చినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏదీ ఏమైనప్పటికి రాధాకిషన్​రావు,గట్టు మల్లు ఆరెస్ట్​తో అక్రమ దందా నెరిపిన పెద్ద పెద్ద వ్యాపారులు సైతం భయాందోళనలో పడ్డారు. కొంత మంది రాష్ట్రం విడిచి వెళ్లిపోయేందుకు సైతం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరో ముగ్గురు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను కూడా ట్యాపింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోనే వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here