హైదరాబాద్, మార్చి 30:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిరోజు మార్చి 31 (ఆదివారం) తో ముగియనున్న నేపథ్యంలో దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. నెఫ్ట్, RTGS తో పాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి. వినియోగదారులు బ్యాంకు సేవలను వినియోగించుకోవచ్చు.