హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

0
2

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని X అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు (ADJ) శుక్రవారం తీర్పు వెలువరించింది.

కోర్టు నిందితుడు నిసార్ అహ్మద్పై హత్య (సెక్షన్ 302 IPC) మరియు సాక్ష్యాధారాల నిర్మూలన (సెక్షన్ 201 IPC) అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించి, యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది.

కేసు వివరాలు

పోలీసుల కథనం ప్రకారం, 2017 ఏప్రిల్ 19న మెహదీపట్నంలోని సంతోష్‌నగర్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు వ్యక్తులు లెదర్ వ్యాపారులమని చెప్పి అద్దెకు ఫ్లాట్ తీసుకున్నారు. మరుసటి రోజు నిందితుడు ఫ్లాట్‌కు తాళం వేసి వెళ్లిపోయాడు.ఏప్రిల్ 24న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో యజమాని, బ్రోకర్, వాచ్‌మన్ కలిసి తలుపు తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్లిన స్థితిలో నీసార్ అహ్మద్ మృతదేహం కనిపించింది. మృతుడి నుదుటిపై బలమైన గాయాలు ఉండటంతో పాటు మెడకు తాడు బిగించిన ఆనవాళ్లు గుర్తించారు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు

అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదాల కారణంగా నిందితుడు హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.ఈ కేసులో సాక్ష్యాధారాలను సమర్థంగా సేకరించి కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారి, పోలీసు బృందం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here