0GGUKATHA:టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ కు బుర్రకథ-బైబిల్ ఆధారంగా కథ

0
55

OGGUKATHA:తెలంగాణ ప్రాంత ప్రత్యేక జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ‘ శాంసన్‌ అండ్‌ దెలీలా ‘ అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్‌ రావు, చిల్కూరి వసంతరావు, చిల్కూరి సుశీల్‌ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు. వీరుడైన శాంసన్‌ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్‌ కథ ఆధారంగా శాంసన్‌ అండ్‌ దెలీలా బుర్ర కథను రూపొందించారు.

టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్న శాంసన్‌ అండ్‌ దెలీలా బుర్రకథను చిల్కూరి సుశీల్‌రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ కథను ప్రధాన కళాకారుడు చిల్కూరి వసంతరావు అద్భుతంగా ప్రదర్శించారు. ప్రేమ, ద్రోహం అలాగే ఎదురించి పోరాడటం వంటి అంశాలను తన కథలో చక్కగా వివరించారు.
చిల్కూరి బుర్రకృథ బృందం 1970 చివర, 1980 తొలినాళ్లలతో తమ ప్రదర్శనలను ప్రారంభించింది. అప్పట్నుంచి హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇచ్చింది. ఇక ఈ బృందం సభ్యుల విషయానికొస్తే.. చిల్కూరి శ్యామ్‌ రావు సీనియర్‌ న్యాయవాది. చిల్కూరి వసంతరావు బెంగళూరులోని యునైటెడ్‌ థియోలాజికల్‌ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. చిల్కూరి సుశీల్ రావు పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్‌ కూడా. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోని కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు.మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే అందించే ఫిలిం కోర్స్ చేశారు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ ద్వారా ఐఐటీ మద్రాస్, సెంట్రల్ యూనివర్శిటీ – కేరళ అందించే ఫిలిం సర్టిఫికెట్ కోర్సులు చేశారు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగితంలో ఐఐటీ మద్రాసులో సర్టిఫికెట్‌ కోర్సు కూడా పూర్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here