11 కేసులలో రూ.80,03,590 నగదుసీజ్ 9 కేసులకు సంబంధించి రూ.20,74,590 విడుదల: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

0
42

హైదరాబాద్,మార్చి 30: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో 11 కేసులలో 50 వేల రూపాయలు మించి ఆధారాలు లేని రూ.80,03,590 నగదు సీజ్ చేయగా, 9 కేసులకు సంబంధించి రూ.20,74,590 విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

జిల్లాలో 50 వేల రూపాయలు మించి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 11 మంది వ్యక్తుల నుండి రూ.80,03,590 సీజ్ చేయడం జరిగిందని, అందులో ఇప్పటివరకు జిల్లా గ్రీవెన్స్ కమిటీలో సరియైన ఆధారాలు సమర్పించిన 9 మందికి 20,74,590 రూపాయల నగదు విడుదల చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన నగదులో 10 లక్షలు మించి పట్టుబడిన రెండు కేసులను ఆదాయ పన్ను శాఖకు రెఫెర్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 10 కేసులలో రూ.77,03,590 సీజ్ చేయగా, 8 కేసులకు సంబంధించి రూ.17,74,590 నగదు రిలీజ్ చేయడం జరిగిందని, రూ.59,29,000 నగదు కు సంబంధించి రెండు కేసులను ఆదాయ పన్ను శాఖ వారికి పంపినట్లు పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కేసులో 3 లక్షల రూపాయలు సీజ్ చేయగా, సరైన ఆధారాలు సమర్పించడంతో విడుదల చేశామని తెలిపారు.
అత్యవసరమైన కేసులకు ( పర్యాటకులు) సంభందించిన వెంటనే పరిశీలించి నగదు ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు
పూర్తి వివరాలకు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఛైర్మెన్ 9618888110, కమిటీ కన్వీనర్ మొబైల్ నంబర్ ,9177872240 సంప్రదించవచ్చునన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here