Dy CM-విద్యుత్ మీద కెసిఆర్ అసత్య ప్రచారం -డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

0
182

Dy CM :

-విద్యుత్ రంగంపై కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు
-ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
-యూనిట్​కు రూ.20 కొన్నది నిజం కాదా?..చర్చకు సిద్ధం
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సవాల్​


పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​ చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలని, వీటిపై చర్చకు సిద్ధమని డిప్యూటీ సీఎం, విద్యుత్తు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురైందన్నారు. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామన్నారు.దీర్ఘకాలిక అవసరాల కోసం చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి విద్యుత్తు కొనుగోలు చేశామని మాజీ సీఎం కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదన్నారు 6 మే 2017 నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు డిసెంబర్ 2014లో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. తెలంగాణ డిస్కమ్ లకు 300 నుంచి 400 మెగావాట్ల కన్నా ఎక్కువ సరఫరా చేయలేదన్నారు. ఏప్రిల్ 2022 నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా ఆపేశారని అన్నారు.. చత్తీస్ గడ్​ రాష్ట్రం తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయించడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తాము యూనిట్ కు రూ. 13 చొప్పున కొనుగోలు చేయలేదని కేవలం యూనిట్ కు రూ 3.90 మాత్రమే అని కేసీఆర్ అంటున్నారని ,నాటి పాలకులు విద్యుత్ యూనిట్​ కు రూ. 20 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇది వాస్త మా? కాదా? ఇది రికార్డుల్లో నమోదు చేయబడి ఉందన్నారు. దీనిపై చర్చకు సిద్ధమని డిప్యూటీ సీఎం ప్రతి సవాల్ విసిరారు.

ఎన్టీపీసీ ఒక్కో యూనిట్ రూ. 15 రూపాయలు చొప్పున చెల్లిస్తే విద్యుత్ సరఫరా చేస్తానని అన్నదని, అందుకు మేము ఒప్పుకోలేదని మాజీ సీఎం ప్రకటించడం వాస్తవ దూరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ టి పి సి యూనిట్ కు రూ.5.60 చొప్పున సగటున ధర నిర్ణయించి 1600 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణ డిస్కమ్ లకు సరఫరా చేసిందన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్​ కొనుగోలు చేశామని కేసీఆర్​ ఆరోపించారని, అందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. డిసెంబర్ 2023 నుండి తెలంగాణ డిస్కమ్స్ కొనుగోలు చేసిన విద్యుత్తు ఒక్కో యూనిట్ సగటు ధర 5.34 మాత్రమే అన్నారు. మేము యూనిట్ కు 13 రూపాయలు చొప్పున చెల్లించి కొనుగోలు చేశామనేది పచ్చి అబద్ధమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 7700 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులో ఉండేదని. ప్రస్తుతం 19 మెగావాట్ల విద్యుత్ ఉందన్నారు. అయినా కేసీఆర్​ పక్కకు పోగానే కరెంటు కోతలు మొదలయ్యాయన్నది రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటన అని కొట్టి పారేశారు. . గత ప్రభుత్వ హయాంలో స్థాపిత థర్మల్ విద్యుత్తు సామర్థ్యం 2080 మెగావాట్లు మాత్రమే. ఇందులో 1000 మెగావాట్లు ఛత్తీస్ గడ్​ నుండి సేకరించారన్నారు. ఏప్రిల్ 20 22 లోనే విద్యుత్ సరఫరాను నిలిపివేసిందని అన్నారు. మిగిలిన 10 80 మెగావాట్ల ధర్మల్ కెపాసిటీని భద్రాద్రి లో సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి అధిక వ్యయంతో నిర్మించారని ఆరోపించారు. . రాష్ట్రంలోని మిగిలిన అన్ని థర్మల్ మరియు హైడల్ ప్రాజెక్టులు గత ప్రభుత్వాలచే 2014 కి ముందే ప్రారంభించారని అన్నారు.
డిసెంబర్ 2023 నుండి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక విద్యుత్ సరఫరాను చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ డిస్కములు రాష్ట్రంలో అత్యధికంగా 15, 623 మెగా వాట్లు మరియు 308.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ను సాధించాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా రికార్డ్ స్థాయిలో 4093 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను తట్టుకొని నిలబడ్డాయన్నారు. డిసెంబర్ 23 నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించిన సందర్భమే లేదన్నారు . గత పది ఏళ్లలో నాసిరకం నాణ్యతలేని లైన్లు ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇతర ఆస్తుల నిర్వహణ సాంకేతిక లోపాల కారణంగా తీవ్ర అంతరాయాలకు దారి తీసిందన్నారు. వాటన్నిటిని మేము గాడిలో పెట్టే పనిలో ఉన్నామని అన్నారు.హైదరాబాద్​ను పవర్ ఐలాండ్ గా మార్చామని మాజీ సీఎం ప్రకటించడం వాస్తవ దూరమైనదన్నారు. 20 12 లో గ్రిడ్ కుప్పకూలిన తర్వాత హైదరాబాద్ పవర్ ఐలాండ్ పథకం చేపట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ పవర్ ఐలాండ్ గా రూపు దిద్దుకుందన్నారు. దేశంలోని 20 దేశంలోని 20 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో ఇలాంటి పవర్ ఐలాండ్ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయన్నారు. మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చామన్నారు. విద్యుత్ కు ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరోపించడం దొంగ దొంగ అన్నట్టు ఉందన్నారు. గత ప్రభుత్వ పాపాల మూలంగా తెలంగాణ డిస్కంలు వేలకోట్లలో అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. 2 జూన్ 2014 రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కం ల నష్టాలు రూ. 12, 186 కోట్లు కాగా మీ పదేళ్ల పాలన పూర్తయ్యేసరికి నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరిందన్నారు. ఈ అంకెలు. విద్యురంగంపై చర్చకు తాను సిద్ధమని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here