KCR:కాంగ్రెస్, బీజేపీ ని నమ్మొద్దు కెసిఆర్

0
79

KCR: కాంగ్రెస్, బీజేపీ ని నమ్మొద్దు -కెసిఆర్

-బీఆర్​ఎస్​ సెక్యూలర్​ పార్టీ
-తెలంగాణ కోసమే భగవంతుడు న న్ను పుట్టించిండు
-తెలంగాణ మీది, భవిష్యత్​ మీది, నిర్ణయం మీది
-420 హామీలతో కాంగ్రెస్​ గద్దెనెక్కింది
-భువనగిరి రోడ్​ షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​

బీఆర్​ఎస్​ పార్టీ సెక్యులర్​ పార్టీ అని, నరేంద్రమోడీ తన బిడ్డను జైళ్లో వేశాడని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు. బస్సు యాత్ర రెండో రోజు సందర్భంగా భువనగిరి సభలో కేసీఆర్ గురువారం పాల్గొని​ ప్రసంగించారు. తెలంగాణ కోసమే భగవంతుడు నన్ను పుట్టించాడని, తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను బతికి ఉన్న రోజులు పనిచేస్తానని అన్నారు.1956 నుండి ఇప్పటి వరకు తెలంగాణకు శత్రువే కాంగ్రెస్​ పార్టీ అని స్పష్టం చేశారు. భువనగిరి, ఆలేరులో ఎంత గోస పడ్డాం .58 ఏండ్లలో . తాగునీటికి గోస ఉండేది. తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చి గోస లేకుండా చేశామన్నారు. పిడికెడు మందితో ప్రజలను నమ్ముకుని ఉద్యమం ప్రారంభించినా.. ఉద్యమం చేసి కొట్లాడి. చావునోట్లో తలపెట్టి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి మంచిగ ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. బోనస్​ బోగస్​ అయ్యిందన్నారు.420 హామీలు చెప్పి ప్రజలను కాంగ్రెస్​ పార్టీ మోసం చేసిందన్నారు.మహిళలకు రూ.2500 ఇచ్చారా అన్నారు. ఆడపిల్లలకు , యువతులకు ఎలక్ట్రీకల్​ స్కూటీలు కొనిచ్చారా? స్కూటీలు కాదు, లూటీలు వస్తున్నాయని ఆరోపించారు. . నిరుద్యోగ యువకులకు మెగా డీఎస్సీ అంటూ దగా చేసింది కాంగ్రెస్​ అని విమర్శించారు.కేసీఆర్​ గుండె చీల్చితే కనిపించేది తెలంగాణ అని అన్నారు. ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోను అని తేల్చారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలువాలని కోరారు. రంజాన్​ తోఫాను కాంగ్రెస్​ పార్టీ ఇవ్వలేదన్నారు.

బీఆర్​ఎస్​ సెక్యూలర్​ పార్టీ.. తన బిడ్డ కవితను బీజేపీ జైళ్లో పెట్టిందని అన్నారు. మీ కోసం నేను చాలా చేసిన విషయాన్ని గుర్తించాలన్నారు. మీ దీవెనతో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ దేవుడి పేరు చెప్పుకుంటూ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుంటే… కాంగ్రెస్​ పార్టీ ముఖ్యమంత్రి దేవుళ్లపై ఓట్లు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు.దేశంలో మహిళలపై రోజు దాడుల వార్తలు వింటున్నాం.. డాలర్​ తో రూపాయి విలువ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. యాదాద్రి ఆలయాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా..అని ప్రజలను అడిగారు.భువనగిరిలో బీజేపీ , కాంగ్రెస్​ ఒక్కటై బీఆర్​ఎస్​ను ఓడించాలని చూస్తున్నారు. అక్షింతలు, పులిహోరా తీర్థాలతో ర్యాలీలు చే స్తారు. వాటితో మన కడుపు నిండుతుందా అని అన్నారు. తెలంగాణలో ప్రతిబోరుకు మీటరు పెట్టాలని అన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్​ కాలేజీ, నవోదయ స్కూల్​ ఇవ్వలేదన్నారు. కేంద్రంలో బీజేపీ ఉండటం వల్లే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. నలుగురు ఎంపీలు గెలిచినా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరుగలేదని విమర్శించారు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నింపడం లేదని ఆరోపించారు. ఏడు మండలాలను మోడీ ఏపీకి అప్పగించారు. భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్​ను గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here