Harish rao MLA:సీఎం, డీప్యూటీ సీఎం దొంగలే :హరీష్ రావు

0
107

Harish rao MLA :

-అబద్ధాల్లో సీఎం , డిప్యూటీ సీఎం పోటీ
-ఎక్స్​ లో విమర్శించిన హరీశ్​రావు

అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని ఎక్స్​ లో హరీశ్​ రావు విమర్శించారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసు పాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడత పెట్టారు. వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమేనన్నారు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీ పైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదమని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నదన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారని అన్నారు. నిన్న నిరుద్యోగ భృతిపై ఎగవేత – నేడు రైతు రుణ మాఫీపై దాట వేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవిగో సాక్ష్యాలు అంటూ హ‌రీశ్‌రావు వీడియోను విడుద‌ల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here