KCR In TV9 interview : మళ్ళీ నేనే సీఎం :టీవీ 9 ఇంటర్వ్యూ లో కెసిఆర్

0
215

KCR In TV9 interview :

-నేను మళ్లీ సీఎం అవుతా
-దేవుళ్లపై ఒట్లు..కేసీఆర్​పై తిట్లు
-కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేయడం అసాధ్యం
-కేసీఆర్​ హిస్టరీ ఆఫ్​ తెలంగాణ
-కేసీఆర్​ వ్యక్తి కాదు ఒక ఇనిస్టిట్యూట్​
-ఫోన్​ ట్యాపింగ్​ సిల్లీ మ్యాటర్​
-ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుతో మేడిగడ్డ నిర్మిస్తా
-తెలంగాణ ప్రజల కోసం విద్యుత్​ కొనుగోళ్లు,కాళేశ్వరం నిర్మాణం
-కేసీఆర్​ను బద్నాం చేసే కుట్రలో భాగమే విమర్శలు
-కాంగ్రెస్​శ్వేత పత్రం ఓ బోగస్​
-శూన్యం నుంచి సునాబీ సృష్టించాం
-లిక్కర్​ స్కాం బోగస్​, నరేంద్రమోడీ చేసినది
-నా కూతురు ముత్యంలా బయటకు వస్తుంది
-కవిత , కేజ్రీవాల్​ వంటి అమాయకులను శిక్షిస్తున్నాడు
-ప్రభుత్వాలను కూల్చడమే నరేంద్రమోడీ లక్ష్యం
-తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు
-బీఎల్ సంతోష్​ మీద కేసు పెట్టామని నా కూతురు మీద కేసు పెట్టారు
-లిక్కర్​ స్కాం కాదు..మోడీ క్రియేటెడ్ స్కీం
-బీఆర్​ఎస్​ కు భారీ మెజారిటీ వస్తుంది
-బీజేపీకి ఒక్క సీటు లేదా జీరో సీట్లు వస్తాయి
-రైతు రుణమాఫీ రేవంత్​రెడ్డి చేయలేడు



రాష్ట్రంలో పరిపాలన వదిలి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ కేసీఆర్​ను తిట్లు తిడుతున్నాడని బీ ఆర్​ఎస్​ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోపించారు. కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేయాలనే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారని, అది సాధ్యం కాదని అన్నారు. మంగళవారం టీవీ 9 తెలుగు చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్​ పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం నుండి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వివరించారు. తన పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై తన మనో భావాలను వివరించారు. ఇంటర్వ్యూలో కేసీఆర్​ మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే…
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ‘చిలిపి వికృత క్రీడలకు పాల్పడుతోంది.

  • కృత్రిమముగా, వికృతంగా పాల్పడే దాడులను చరిత్ర తిప్పికొడుతుంది.
  • కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం సాధ్యమయ్యే పనేనా?
  • ఇందిరమ్మ అహంకారంతో ఎమర్జెన్సీ పెడితే ఏమైందో తెలిసిందే..జనతా పార్టీ జైళ్లో ఉండి అధికారంలోకి వచ్చి
  • కేసీఆర్ ఇజ్ నాట్ ఓన్లీ ఎ పర్సన్..హి ఈజ్ ఏ ఇనిస్టిట్యూషన్​
  • కేసీఆర్ ను తిట్టమని వాళ్లకు అధికారం ఇవ్వలేదు.
  • ఐదు నెలల విలువైన సమయం వృథా అయింది. కాంగ్రెస్​ పార్టీ తనను బద్నాం చేయాలని చూస్తుంది.
    కాంగ్రెస్​ పార్టీ పాలన చేతకాని అర్భకులు, దద్దమ్మలు ఆరోపణలు చేస్తున్నారు
  • బీ ఆర్ ఎస్ కు వన్ థర్డ్ సిట్లు వచ్చినయ్. బీ ఆర్ ఎస్ ను ప్రజలు తిరస్కరించలేదు. కేవలం 1.8 ఓట్ల తేడాతోనే అధికారానికి దూరమయ్యాం.
  • కొత్తకుండలో ఈగ జొచ్చినట్లుగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ పరిస్థితి ఉండేది
  • రాష్ట్రం ఏర్పడేనాటికి పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నయి.
  • బజారు భాష మాట్లాడటం వేరు..బాధ్యతతో ప్రభుత్వాన్ని నడపటం వేరు.
  • అత్యధిక సంపన్న దేశం..అత్యధిక అప్పులున్న దేశం కూడా అమెరికానే.
  • రాష్ట్ర బడ్జెట్ కూర్పు విభిన్నంగా ఉంటుంది.
    :* అర్థంపర్థం లేకుండా బట్టకాల్చి మీదేసే విధంగా ఆర్థిక పరిస్థితిపై ఆరోపణలు చేస్తున్నారు.
  • కాంగ్రెస్ ది బోగస్ శ్వేతపత్రం. వారు అజ్ఞానులు ,అర్భకులు
  • ప్రజల ఆకాంక్షను తీర్చే ప్రయత్నంలో అప్పులు చేయాల్సి వస్తుంది.
  • ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న “భట్టి విక్రమార్క’ ఆనాడు చదువుకోలేదా?
  • కరెంటు పై కూడా కాంగ్రెస్ వెకిలి ప్రయత్నం చేస్తోంది.
  • 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వలేదు. ఏడు మండలాలు ఆంధ్రలో కలిపింది
  • నేటి సీ ఎం గా ఉన్న వ్యక్తి రాష్ట్రం ఏర్పడిననాడు సమైక్య పార్టీ తరపున కరెంటు లేదని అసెంబ్లీలో గోల చేసిండు.
  • కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకొని తెలంగాణ చీకటి రాష్ట్రం అయితదని చెప్పిండు.
  • మేం మూడు, నాలుగు నెలల్లోనే 24 గంటల కరెంటునిచ్చాం.
  • అమ్మ పెట్టదు.. అడుక్క తినొద్దంటే పవర్ ఎక్కడి నుంచి వస్తది?
  • అతి భయంకరంగా ఉన్న కరెంటు పరిస్థితిని చక్కదిద్దాం.
  • చాలామందికి అవగాహనలేని విషయాలను పట్టుకొని మమ్మల్ని బద్నాం చేయాలనే కుట్ర నడుస్తోంది.
  • కాంగ్రెస్ చిలిపి, చిల్లర రాజకీయ క్రీడ.:
  • కరెంటు కొనుగోలుకు కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారం.
    యునిట్​కు రూ.3.90 కే కొన్నాం. పీక్​ లోడ్​ ఉన్నప్పుడు ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది.
  • ఇప్పటి ప్రభుత్వం కూడా పవర్ ను అధిక రేట్లకే కొనుగోలు చేస్తున్నది.
  • కేసీఆర్ పక్కకు పోగానే కట్క బంజేసినట్లుగా కరెంటు ఎందుకు పోతున్నది?.. కేసీ ఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్షణం కూడా పొకుండా ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి.
  • ఉన్న వసతులు, వనరులను వాడుకొలేని దద్దమ్మలు, అసమర్ధులు.
  • జెన్కో, ట్రాన్స్కో ల్లో అందర్నీ ఐఏఎస్ లనే నియమించారు. టెక్నో క్రాట్లను విస్మరించారు. ఐఏఎస్ లు పాలనలో తక్కువేం కాదు. కానీ విద్యుత్ సంస్థలకు అనుభవమున్న టెక్నో క్రాట్లు అవసరముంది. విజయవంతంగా నడిపారు
  • న్యూయార్క్ లో..లండన్ లో పవర్ కట్ చూస్తారేమో గానీ..హైదరాబాద్ లో పవర్ కట్ ను చూడరని నేను గర్వంగా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
    కరెంటు ఇవ్వలేని దద్దమ్మలు, అసమర్ధులు కేసీఆర్ ను దోషీగా చూపే ప్రయత్నం చేస్తున్నారు
    ఉన్నదానిని వాడుకోలేని వాళ్లు దద్దమ్మలు కాదా..
  • అసలు నేరస్థులు, అసమర్ధులు కాంగ్రెస్ పాలకులే.
  • కేసీ ఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లున్నదో ప్రజల అనుభవంలో ఉంది.
  • నేను చెప్పేది నిజమైతే పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండి.
  • అనాడు సమైక్య పాలకులు తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష పాటించిండ్రు. నాడు అన్ని అసంపూర్తియే.
  • తెలంగాణ భౌగోళిక వ్యవస్థలో ఎత్తిపోతలు తప్పితే వేరే మార్గం లేదు.
  • ప్రాణహిత జీవనది..ప్రాణహిత లేకుండా గోదావరిని ఊహించలేం.
  • తెలంగాణలో గోదావరి హయ్యెస్ట్ హైట్ లో ఉంటుంది.
  • 11వ శతాబ్ధపు కాకతీయ రాజులు పుణ్యాత్ములు. వాళ్లకి ఆ టెక్నాలజీ ఎవరు చెప్పారో గానీ అద్భుతం. వేలాది చెరువులు నిర్మించారు.
  • వైఎస్సార్ తదితరులు ఎత్తిపోతలకు ఆనాడే అవకాశం ఇచ్చారు.
  • రాజకీయ నాయకులు స్టాటజిస్టులు మాత్రమే..డిజైనిస్టులు కాదు.
  • తెలంగాణకు అధిక నీళ్లు రావాలని స్ట్రాటజిస్టుగా చెప్పిన.
  • కాళేశ్వరం నేను డిజైన్ చేయలేదు. వ్యాప్కో సర్వే చేసింది. సిడబ్ల్యుసీ రిపోర్టులున్నాయి. డిఫెన్స్ అనుమతులూ తీసుకొన్నాం.
  • తక్కువ ముంపు తీసుకొని, వరద సమయంలో నీళ్లను తెచ్చుకోవాలి.
  • అప్పటి సీడబ్ల్యుసీ ఛైర్మన్ మెచ్చుకొన్నాడు.
  • ఆర్టీసీ, పవర్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ లు సర్టిఫైడ్ చేసినయ్. మేధావులు, నిపుణులు ప్రశంసించిండ్రు.
  • కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం తెలియని అసమర్థులు, తెలివితక్కువ దద్దమ్మలు కాంగ్రెసోల్లు.
  • కాళేశ్వరంపై కేసీఆర్ ను, బీ ఆర్ ఎస్ ను ఎప్పటికప్పుడు బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నరు.
  • నా కండ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకునేది లేదు.
  • చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలను బలిపెడతానంటే చూస్తూ ఊరుకునేది లేదు.
  • మూడున్నర కోట్ల మెట్రిక్​ టన్నుల పండిన పంట వాస్తవం కాదా?
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆనాడు ఎప్పుడైనా నీళ్లు వచ్చినయా?
  • యూపీలో, బీహార్ లో అమెరికాలో డ్యామ్ లు కొట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి.
  • కోమటిరెడ్డి బ్రదర్స్ కట్టిన మిడ్ మానేర్ కొట్టుకపోతే మేం వాళ్లని జైళ్లో వేసినమా? మేం చిల్లర రాజకీయాలు చేయలేదు. తెలంగాణ బాగోగుల గురించే ఆలోచించినం.
  • కేసీ ఆర్ ను బద్నాం చేయాలని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రైతుల కడుపు కొట్టడానికీ కూడా వెనుకాడలేదు.
  • ఒక పన్ను బాగాలేదని మొత్తం పండ్లనే తీసేస్తమా? డెంటిస్ట్ దగ్గరకెళ్లి ఆ పన్ను మాత్రమే రిపేర్ చేసుకుంటం.
  • పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు కాంగ్రెస్ పని పడతరు.
  • సెక్రటేరియట్, ఎమ్మెల్యే క్వార్టర్స్, పాలమూరు ప్రాజెక్టు, సీతమ్మ ప్రాజెక్టులు, గ్రామ పంచాయతీలకు తాండాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, 1100 రెసిడెన్షియల్ స్కూళ్లను కూలగొడతావా? ఇవన్నీ కేసీ ఆనవాళ్లే కదా..
  • ఓటుకు నోటు కేసులో పట్టుకున్నందుకే రేవంత్ రెడ్డి కక్ష పెట్టుకున్నాడు.
  • 60 వేల కోట్లతో ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్​… మూడు లక్షల కోట్ల బడ్జెట్ కు పెంచినం. ఇది గర్వకారణం.

  • వైయస్సార్ సీ ఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రియంబర్స్ లను మేం కొనసాగించినం. దాని మీద కేసీ ఆర్ కిట్, అమ్మవొడి, బస్తీ, పల్లె దవాఖానాల వంటి వాటితో ఇంప్రూవ్డ్ చేసినం.
  • కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులను, నీళ్లను మేం వాడమని వదిలేసినమా? సచివాలయం నేనే నిర్మించినా అందులో కూర్చోవడం లేదా.. యాదాద్రి దేవాలయం నిర్మిస్తే అక్కడికి వెళ్లి పూజలు చేశారు. దాన్ని కూలగొడ్తారా.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అతిచిన్న లోపాన్ని సరిదిద్ది ఉపయోగించకుంటే ప్రజా ఉద్యమం తప్పదు. మేం చూస్తూ ఊరుకోం.
    తెలంగాణపై తన ఆనవాళ్లను తొలగించలేరని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ‘మీరు కూర్చున్న సచివాలయం నేను కట్టించిందే.. యాదాద్రి కూడా నేను నిర్మించిందే. మంగళవారం టీవీ9 లైవ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
    ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కేసీఆర్ పేర్కొన్నారు. దానిపై కోపంతో తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఇంకేం ఉంటుందన్నారు. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదన్నారు. తెలంగాణను అస్థిర పరిచేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణ ఎడారి కావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. కాంగ్రెస్ నాటకాలు ప్రజలకు తెలిసి పోయాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం అని స్పష్టం చేశారు.

  • కేసీఆర్‌ ఆనవాళ్లు తీసేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ ఆనవాళ్లు అన్నింటినీ తీసేస్తాం అని ముఖ్యమంత్రి అంటున్నారు? తీసేయగలరా.. అది సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు. ఓ మీడియా ఛానల్‌లో బిగ్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. మీరు కూర్చుంటున్న సెక్రటేరియట్‌ కేసీఆర్‌ ఆనవాళ్లు కాదా అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

మీ ఎమ్మెల్యేలు ఉంటున్న క్వార్టర్లు కేసీఆర్‌ కట్టినవే కదా? యాదాద్రి దేవాలయం కట్టింది కేసీఆరే.. దానికే పూజకు పోయినవ్‌ కదా? యాదాద్రి దేవాలయం కూలగొడతావా? పాలమూరు ఎత్తిపోతల పథకం బంద్‌ పెడతవా? సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు బంద్‌ పెడతవా? కేసీఆర్‌ సమ్మక్క బ్యారేజి కట్టిండు దాన్ని కూలగొడతవా? ఏది బంద్‌ పెడతవ్‌ అని ప్రశ్నించారు. ఒకవేళ ఆనవాళ్లు తీసేయాలంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ అవుతుందని స్పష్టం చేశారు.’ కేసీఆర్‌ ఈజ్‌ హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ. హీ మేడ్‌ హిస్టరీ. ఐ బాట్‌ తెలంగాణ. ఐ రూల్‌డ్‌ తెలంగాణ ఫర్‌ టెన్‌ లాంగ్‌ ఇయర్స్‌. హౌ కెన్‌ యూ డూ దట్‌.’ అని నిలదీశారు.

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం కట్టినం. దాన్ని కూలగొడతవా? అది కేసీఆర్‌ ఆనవాళ్ల కింద ఉండదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 1100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు పెట్టినం తీసేస్తవా? 33 కొత్త జిల్లాలు పెట్టిన తీసేస్తవా? మూడు నాలుగు వందల కొత్త మండలాలు చేసినం.. తీసేస్తావా? వాట్‌ ఈజ్‌ దట్‌ యూ గోయింగ్‌ టు డూ? అని అడిగారు. తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్‌ చేసిండు.. తీసేస్తవా? కేసీఆర్‌ ఆనవాళ్లు ఏది తీసేస్తావ్‌. కేసీఆర్‌ ఆనవాళ్లు తీసేయాలంటే.. తెలంగాణనే తీసేయాలని స్పష్టం చేశారు.

రేవంత్‌ రెడ్డికి తన మీద ఉన్నది కోపం అని అనుకోవడం లేదని.. అది ఒక రకమైన అజ్ఞానమని కేసీఆర్ తెలిపారు‌. ‘ తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రాన్ని ఆగం చేయాలని అనుకున్నారు. కొంతమంది ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేయాలని అనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు అనే విచిత్ర కథ తీసుకొచ్చారు. తెలంగాణ పాలకులు తమ ఓటును కూడా తాము వేయించుకోలేకపోతున్నారని దుష్ప్రచారం చేయాలని చూశారు. అందులో ఈయన రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన దోషి. 50 లక్షలను స్టీఫెన్‌ సన్‌ అనే ఎమ్మెల్యేకు ఇస్తూ దొరికిన దోషి.’ అని అన్నారు. అదే కక్షగా పెట్టుకుని రేవంత్‌ రెడ్డి ఇదంతా చేశారని అభిప్రాయపడ్డారు.
అంతర్‌ రాష్ట్ర వివాదాలు, ముంపు సమస్యలు రావద్దంటే కన్నెపల్లికి కొంత దూరంలో కడితే మేడిగడ్డ బ్యారేజి లేకుండా నీళ్లు తీసుకోవచ్చని ఇంజనీర్లు చెప్పారని ఆనాటి పరిస్థితులను కేసీఆర్‌ తెలిపారు.. దాని ప్రకారమే మేడిగడ్డ బ్యారేజి కట్టామని.. ఇప్పుడు కూడా బ్యారేజి లేకుండానే నీళ్లు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి మేడిగడ్డ అవసరం లేదని.. మేడిగడ్డ బ్యారేజికి సంబంధం లేకుండా వందల టీఎంసీలు తీసుకోవచ్చని. తీసుకున్నాం కూడా అని తెలిపారు.

‘ గోదావరిలో 50 వేల క్యూసెక్కుల వరద వస్తే పంప్‌హౌస్‌ రన్‌ అవుతుంది. అలా ఏడాదిలో నాలుగు నెలలు ఉధృతి ఉంటుంది. అప్పుడు ఎంతైనా నీళ్లు ఎత్తుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజికి 80కి పైగా గేట్లు ఉంటాయి. గోదావరికి వరద వస్తున్న సమయంలో అన్ని గేట్లు ఎత్తేస్తారు. గోదావరి నది ఫ్రీగా ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడు అందినంత వరకు పంప్‌హౌస్‌ నుంచి వాడుకుంటారు. అక్కడ 2200 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న 17 పంప్‌ సెట్లు న్నాయి. వాటిలో ఎన్ని అవసరం ఉంటే.. అన్ని వాడుతుంటాం. సెప్టెంబర్‌లో వర్షాలు తగ్గుముఖం పడుతాయి. అప్పుడు మొత్తం గేట్లు మూసివేయకుండా.. అటు, ఇటు చివరలో నాలుగు గేట్లు తెరిచి ఉంచుతారు. ఈ గేట్ల ద్వారా వచ్చిన నీరు వచ్చినట్లు వెళ్తుంటాయి. నదీ ప్రవాహాన్ని బట్టి ఒక్క గేటు కూడా తెరిచి ఉంచుతాం. ఫిబ్రవరిలో కూడా 30, 40 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటుంది. అప్పుడు కొంత ఉంచుకుంటూ పంప్‌హౌస్‌లు రన్‌ చేస్తుంటాం. ఇక్కడ ఉన్న కిటుకు ఇది. ఎండాకాలంలో రెండో పంట సమయంలో సాగు నీరు, మంచి నీటి కోసం ఇది ఉపయోగపడుతుంది. వరద ఉండే టైమ్‌లో ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. అక్కడ మూడు బ్యారేజిలు కట్టినం. 16 టీఎంసీలు, 7 టీఎంసీలు, 11 టీఎంసీలు ఉంటాయి. మీద ఎల్లంపల్లి బ్యారేజిలో 20 టీఎంసీలు ఉంటాయి. దీని మీద మిడ్‌ మానేరు, రిజర్వాయర్లు ఉంటాయి.’ అని కేసీఆర్‌ తెలిపారు.

‘ మేం 14 టీఎంసీలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల నుంచి 147 టీఎంసీల రిజర్వాయర్‌ కట్టినం. ఈ 147 టీఎంసీల రిజర్వాయర్లు క్షేమంగా ఉన్నాయి. 200 కిలోమీటర్ల టన్నెల్స్‌ క్షేమంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన సర్జ్‌పూల్స్‌ ఉన్నాయి. 1500 కి.మీ. కాలువలు కట్టినం. అవి క్షేమంగానే ఉన్నాయి. మూడు బ్యారేజిల మీద కట్టిన అన్ని పిల్లర్లు క్షేమంగానే ఉన్నాయి. అట్లనే కాల్వల మీద కట్టిన బ్రిడ్జిలు, వాటికింద కట్టిన వందలాది పిల్లర్లు మంచిగనే ఉన్నాయి. అనేక పంప్‌హౌస్‌లు బ్రహ్మాండంగానే పనిచేస్తున్నాయి. ఒక్క మేడిగడ్డ బ్యారేజిలోని ఏడో బ్లాక్‌లో 10 పిల్లర్లు ఉన్నాయి. వాటిలో రెండు పిల్లర్లు కొంచెం ఎక్కువ, మూడో పిల్లర్‌ కొంత కుంగినయ్‌. ఇవి ఎన్నికల ముందే కుంగినయ్‌.’ అని కేసీఆర్‌ తెలిపారు.

పిల్లర్లు ఎందుకు కుంగినయ్‌.. ఏమైందని అక్కడి అధికారులను అడిగితే జరిగింది చెప్పారని కేసీఆర్‌ తెలిపారు. ‘ అంతకుముందు సంవత్సరం 28 లక్షల క్యూసెక్కుల భయంకరమైన వరద వచ్చింది. అప్పుడే కన్నెపల్లి పంప్‌హౌజ్‌ మునిగింది. దాన్ని రిపేర్‌ చేసుకున్నాం. ఆఫ్‌లైన్‌ ఎప్పటికప్పుడు సరి చేయాలి. వీటికోసమే ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం ఈఎన్‌సీ పోస్టు క్రియేట్‌ చేసి నాగేందర్‌కు బాధ్యతలు అప్పగించాం. అక్కడ ఉండే సీఈ ఆ మెయింటెన్‌ చేయాలి. దాన్ని సర్దాలి. కానీ అది సర్దకపోవడంతో దాని కింద ఉన్న ఇసుక కుంగి కొంచెం క్రాక్‌ వచ్చింది. అది కూడా ఒక్కటే బ్లాక్‌లోనే. కాంగ్రెసోళ్లు ఏమనుకున్నారు.. మేం అట్నే వదిలేస్తాం.. కేసీఆర్‌ను బద్నాం చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలి.. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో ఉన్నారు. అప్పటికే 8, 10 వేల క్యూసెక్కుల నీరు పోతా ఉంది. ఆ ఇసుకలో కాపర్‌ డ్యామ్‌ వేసిన ఇక్కడ పంప్‌లు గుంజుతాయి. దాంతో ఎప్పటికప్పుడు నీటిని నింపాల్సి ఉండే. కానీ వాళ్లు మొత్తం బ్యారేజి కొట్టుకుపోతుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఒక్క బ్లాక్‌ను రిపేర్‌ చేయకపోయినా.. మిగిలిన బ్లాక్‌లు వందేళ్లు అయినా పనిచేస్తాయి.’ అని కేసీఆర్‌ అన్నారు..

‘ చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బలి చేస్తామంటే ఎలా ఊరుకుంటాం.. టన్నెల్స్‌కు ఏమైనా అయ్యిందా? కాల్వలకు ఏమైనా అయ్యిందా? పంప్‌హౌస్‌లకు ఏమైనా అయ్యిందా? బ్యారేజిలకు ఏమైంది? అక్కడ ఎంత వెర్రి చేతలు.. అక్కడ గ్రౌటింగ్‌ ప్రతి సంవత్సరం చేయాలి. నదుల మీద ఉండే బ్యారేజిలు, రిజర్వాయర్లకు ఎప్పటికప్పుడు మెయింటైన్‌ చేస్తూనే ఉండాలి. ఆ మెయింటెనెన్స్‌ నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టు లేచి పోతుందన్నారు.’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

రైతు రుణమాఫీ కాంగ్రెస్​ ప్రభుత్వం చేయలేదు. రుణమాఫీ చేయాలంటే రూ.37 వేల కోట్లు కావాలి
కవిత ముత్యంలా బయటకు వస్తుంది.
కేజ్రీవాల్ మీద గెలువలేక మోడీ జైళ్లో వేసిండు.
న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకముంది. కవిత బయటకు వస్తుంది.
రైతుబంధు అట్టర్​ ప్లాప్​, నీళ్లు,కరెంటు ఇవ్వడంలో ఫెయిల్​ మాయమైన బోర్లు మల్ల వచ్చినయి
కాళేశ్వరం నుండి 60,70 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి విడిచిపెట్టడం వల్లే రైతుల పొలాలు ఎండిపోయాయి.
టీఆర్​ఎస్​ మెజారిటీ సీట్లు గెలుస్తాయి. 8 నుండి 12 సీట్లు గెలుస్తుంది. బీజేపీ అకృత్యాల వల్ల ఒక్క సీటు లేదా మొత్తానికి సీటు కూడా రాకపోవచ్చు.
కడియం శ్రీహరికి ఓడిపోయి. ఇంట్లో ఉంటే అనేక పదవులు ఇచ్చాను.
ఆయన ఖర్మ బాగా లేక బీఆర్​ఎస్​ నుండి వెళ్లిపోయాడు
నాలుగు ఏండ్లు పదవి ఉన్నప్పుడు స్వేచ్ఛ లేదా కడియం శ్రీహరికి
బీఆర్​ఎస్​ మహాసముద్రం… పిడికెడు మంది పోతే బీఆర్​ఎస్​కు ఏం పోదు. తలమాసిన వాళ్లు పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లిన వారు ఫోన్లు చేస్తున్నారు. వారిని కాళ్లుమొక్కినా చేర్చుకోను.
నేను మళ్లీ సీఎం అవుతా
బీజేఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి రోజు స్టేట్​ మెంట్​ ఇస్తున్నాడు. లక్ష్మణ్​రోజు స్టేట్ మెంట్​ ఇస్తున్నారు. రేవంత్​ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు అని.దీనిని సీఎం రేవంత్​రెడ్డి స్పందించడం లేదు.
ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ ఉన్న ఎల్ అండ్ టీ లాంటి కంపెనీలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టబడింది. వాళ్లు రిపేర్ చేస్తామని ముందుకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేయించట్లేదు.

  • సీ ఎంకు పాలమూరు ప్రాజెక్ట్ నీళ్లు కావాలో, వద్దో తేల్చుకోవాలి.
  • ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతాం.
  • బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రాకముందు ఎందుకు నీళ్ల ట్యాంకులు, ఆడబిడ్డల లైన్లు ఎందుకున్నయ్? కేసీ ఆర్ పాలనలో ఎందుకు లేవు?
  • నల్గొండను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.
  • మిషన్ భగీరథలో నో మెయింటెనెన్స్.
  • ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఎవ్వరూ ఇవ్వని విధంగా ఇచ్చినం.
  • వీధి నల్లాలు బంద్ చేసినం. వాటర్ ట్యాంకులు లేవు.
  • ఐదేండ్లు నడిచిన మిషన్ భగీరథను నడిపే తెలివి లేదు.
  • లిక్కర్ స్కామే బోగస్. మోదీ సృష్టి.
  • కవిత కు లిక్కర్ స్కాంకు సంబంధం లేదు. కడిగిన ముత్యంలా వస్తుంది.
  • బి.ఎల్.సంతోష్ పై కేసు పెట్టినందుకే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేసిండ్రు.
  • * ఢిల్లీ ముఖ్యమంత్రికి, ఒక ఎమ్మెల్సీ లకు బెయిల్ ఇవ్వరా? వారేమైన దేశం వదిలి పారిపోతరా?
  • మోదీది ఇంత నియంతృత్వమా? మోదీ ఘోరమైన పాపకృత్యానికి పాల్పడ్డాడు.
  • ఢిల్లీ లిక్కర్ కేసు మోదీ పొలిటికల్ స్కాం.
  • కేజ్రీవాల్ చేతిలో మూడుసార్లు ఘోరంగా ఓడిపోయిన ఆక్రోశంతో మోదీ అరెస్ట్ చేయించాడు.
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో బీ ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుంది. కేసీ ఆర్ అధికారంలోకి వస్తాడు.
  • దేవుండ్ల మీద ఒట్లు ఎందుకు పెట్టాలె?
  • డిసెంబర్ 9న మాఫీ చేస్తానన్న రుణమాఫీ ఎందుకు చేయడం లేదు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.
  • నాడు నోట్ల రద్దు ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీని చేసుకుంటూ వచ్చాం.
  • మేం ఇచ్చిన రైతు బంధునే ఇవ్వలేక పోయినం.అట్టర్ ప్లాఫ్.
  • పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెడుతరు.
  • కాంగ్రెస్ పాలనలో మాయమైన బోర్లు మళ్లీ వచ్చినయ్.
  • బీ ఆర్ ఎస్ కు 8 నుంచి 12 సీట్లు వస్తయ్.
  • బీజేపీ కి 0 నుంచి 2 సీట్లు వచ్చినయ్.
  • కడియం రాజకీయంగా సచ్చి..బీ ఆర్ ఎస్ ను బతికించిండు.
  • కడియం ఖర్మ బాగాలేక పార్టీ వదిలిండు. రాజకీయ భూస్థాపితం చేసుకున్నాడు.
  • కడియం బిడ్డకు టిక్కెట్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడబోయింది?
  • బీ ఆర్ ఎస్ ఒక మహా సముద్రం. పిడికెడు మంది పోయినా ఏం కాదు.
  • పార్టీ రాజకీయ వ్యవస్థ ద్వారానే తెలంగాణ సాధించిన.
  • రాజకీయాలు సమ్మిళితం.
  • కాంగ్రెస్ లోకి పోయిన వారం రోజుల్లోనే మళ్లీ బీ ఆర్ ఎస్ లోకి వస్తామంటున్నరు.
  • బీజేపీ లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డి లు రోజూ ప్రభుత్వం కూలిపోతుందని, రేవంత్ ఏక్ నాథ్ షిండే అవుతడంటున్నా సీ ఎం ఏనాడూ ఖండించలేదు.
  • ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీపడ్డది.. కర్ణాటక తర్వాత తెలంగాణ ల్లో మోదీ బాంబు పడనున్నది.
  • మేం ప్రజాస్వామ్య వాదులం. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని కోరుకుంటున్నం. అప్పుడే కాంగ్రెసోల్ల అవినీతి బయటపడుతది.
  • తులం బంగారం తుస్సుమన్నది. ఇందిరమ్మ ఇండ్లు లేవు. కరెంట్ బిల్లులు ఎక్కువొస్తున్నయ్.. ఆరు గ్యారంటీలు బోగస్ అని తేలిపోయింది.
  • ప్రజల పక్షాన వాదించే పంచ్ యే బీ ఆర్ ఎస్.
  • బీ ఆర్ ఎస్ పార్టీ టీ ఆర్ ఎస్ గా మారే ఛాన్స్ లేదు.
  • పనితనం, సిద్ధాంతం, వైఖరుల్లోనే మనుగడ ఆధారపడి ఉంటుంది గానీ సింబల్ పై ఏం ఉండదు.
  • జాతీయ రాజకీయాల్లో మనం భాగస్వామ్యం కావాలి.
  • దురదృష్టవశాత్తూ ఇక్కడ ఓడిపోయాం..గెలిచుంటే మహారాష్ట్రలో దుమ్ము లేపేవాళ్లం.
  • మోదీ ప్రభావం రోజురోజుకీ తగ్గిపోతున్నది.
  • ఆంధ్రాలో ఎవరు గెలిచినా మాకేం బాధ లేదు. మాకు సంబంధం లేదు. జనరల్ గా మాకందే సమాచారం ప్రకారం జగన్ వచ్చే అవకాశం ఉన్నట్లున్నది.
    25 మంది ఎమ్మెల్యేలను తీసుకువస్తా అని కాంగ్రెస్​ నాయకుడు అన్నారు.
    111 ఎమ్మెల్యేలు ఉంటేనే బీజేపీ మా గవర్నమెంటు ను కూల్చాలని చూశారు.
    హిమాచల్​ ప్రదేశ్​, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు కూలిపోతున్నాయనే సమచారం ఉంది.
    గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది.
    పార్లమెంటు ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతున్నాయి.
    కాంగ్రెస్​ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం.. అప్పుడు కాంగ్రెస్​ ఏంటో బయటపడుతుంది.
    టీడీపీ, కాంగ్రెస్​ పదేళ్లు అధికారంలో లేకపోతే అయిపోయిందా..బీఆర్​ఎస్​ అయిపోతుందా.
    తులం బంగారం తుస్సుమన్నది.యువవికాసం పోయిందిజ
    ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఫ్రీ విద్యుత్​ లేదు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలు బోగస్​ అని తేలిపోయింది.
    కాంగ్రెస్​కు చురక పెడుతారు.
    నేను చెప్పిందల్లా జరిగింది. తెలంగాణ వస్తదని చెప్పినా వచ్చింది. రెండో సారి గెలస్తామని చెప్పినా గెలిచినం.
    రాబోయే రోజుల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోకి వస్తుంది. కేంద్ర రాజకీయాలను కూడా బీఆర్​ఎస్​ శాసిస్తుంది.
    బీజేపీకి అంత సీన్​ లేదు.
    ఏపీలో ఏం జరిగినా మాకు పట్టింపులేదు. బాధ లేదు.సమాచారం ప్రకారం జగన్​ గెలుస్తడు.
    ఫోన్​ ట్యాపింగ్​ పరిపాలనా అంశం. పోలీసులు చేస్తరు. ముఖ్యమంత్రి చేయడు, ముఖ్యమంత్రికి తెలియదు. పోలీసుశాఖకు సంబంధించిన అంశం.

  • కాంగ్రెస్​ బుర్ర తక్కువ ప్రభుత్వం.దీనిని రాజకీయాంశంగా మార్చింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి జ్క్షానం ఉంటే ఇంటలీజెంట్​ బ్రీఫింగ్​ వస్తదా? రాదా.? ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఉంటుంది.
    రాజకీయ ట్యాపింగ్​ సిల్లీ ప్రచారం. పోలీసులు చెబుతరా. ముఖ్యమంత్రి కి రిపోర్టు చేరుతదా.హోం సెక్రటరీ పరిశీలిస్తుంది.
    ఫోన్​ ట్యాపింగ్​ను రాజకీయం చేయడం దివాళాకోరుతనం. ఆఫీసర్​ తప్పు చేస్తే డీజీపీ చూస్తాడు. వెరీ సిల్లీ మ్యాటర్​
    కేసీఆర్​ ఇమేజ్​ ను దెబ్బకొట్టాలనే ఆలోచన నెరవేరదు
    గత 25 సంవత్సారాలుగా నా చుట్టే రాజకీయాలు జరిగాయి
    పిచ్చి ప్రయత్నాలు మానుకోండి
    ముఖ్యమంత్రికి ఫోన్​ ట్యాపింగ్​ కు సంబంధం ఉండదు
    చానళ్లు దుర్మార్గం చేస్తున్నాయి. బాకా పత్రికలు మీడియా పెద్దగా చేస్తుంది
    గూడుపుఠాని చేస్తే శిక్ష అనుభవమిస్తుంది.
    రైతుల మీద పట్టింపు లేదు. విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నారు. పట్టించుకోవడం లేదు.200 మంది రైతులు చనిపోయారు.
    పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్​ దెబ్బతిన పోతున్నారు
    కాంగ్రెస్​ చర్యల పట్ల జాలి పడుతున్నారు.
    నన్ను ఏం చేస్తారో చేయమనండి. చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్రూం కట్టిస్తా..కట్టివ్వు
    వీధి రౌడిలు చేసే హెచ్చరికల్లా సీఎం రేవంత్​ చేస్తున్నాడు.
    ఇబ్బందులు ఉన్న తెలంగాణ సాధకుడిని ఏం చేస్తావ్​.. ప్రజలు బుద్ధి చెబుతరు.
    న్యాయ వ్యవస్థ, ప్రజలు, ప్రజా క్షేత్రం ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా.
    సమైక్య వాదులు నా మీద దాడులు చాలా చేశారు. ఆ సమయంలో సమర్ధవంతంగా తిప్పికొట్టినా. తెలంగాణ కాంగ్రెస్​ వాళ్లను దద్దమ్మలు, అసమర్థుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అనేవాడిని, వ్యంగ్యం ప్రదర్శించేవాడిని.
    అసెంబ్లీలోకి వెళ్లి వారి వైఫల్యాలను చీల్చి చెండాడుతాం. చాలా కుంభకోణాలు కనబడుతున్నాయి. పదేండ్లు అధికారంలో ఉన్నాం. మా మనుషులు అన్ని విభాగాల్లో ఉన్నారు.
    60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ మాది. క్యాడర్​ అద్భుతంగా ఉన్నారు. లీగల్​ బ్యాటిల్​ కోసం రూ.10 కోట్లు కేటాయించాను. నిర్మాణం చేస్తాం, అధికారంలోకి వస్తాం. ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇస్తాం
    కోటరీ లేదు. అందరిని కలుపుకుంటూ పోతా
    నేను తెలంగాణ పునర్నిర్మాణ కర్తను. అందుకే ఆలోచనతో ప్రణాళికలు చేసే క్రమంలో ఎవ్వరికి టైం ఇవ్వలేదు.
    ప్రజా దర్బార్​ ఏది? ఒక్క సమస్య పరిష్కారమేది. శ్వేత పత్రం విడుదల చేయండి దమ్ముంటే. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఎన్ని పరిష్కారం చేసిండ్లో చెప్పండి.
    దొరల పాలన ఎవ్వరిదో ..చెప్పాలి
    దళితబంధు 10 లక్షలు ఇచ్చినం. పేద విద్యార్థులకు ఇచ్చింది దొరల పాలనా? విష ప్రచారం చేసి గెలిచారు. అడుగడుగునా మానవీయ కోణం ఉంటుంది.
    రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టమంటరా. ఎవడు దొరలు. రైతులను ఎంత పీడిస్తున్నారు మీరు. కల్లాల్లో రైతుల వడ్లు కొనడం లేదు. దిక్కులేదు. రైతులకు.
    ప్రగతి భవన్​ ముందు గ్రిల్​ నేను వేయలేదు. కిరణ్​ కుమార్​ రెడ్డి వేసిండు. ప్రగతి భవన్​ కేవలం ఫోర్​ బెడ్రూం హౌజ్​. అడ్డగోలు హామీల వల్ల ప్రజలు మోసపోయారు.
    ఎన్నికల తర్వాత కేసీఆర్​ ఓడిపోతామనుకోలేదని నాకు మా నాయకులు చెప్పారు
    హైదరాబాద్​ నాతో ఉన్నారు. గ్రామీణ ప్రజలు అమాయకులు మోసపోయారు. పార్లమెంటు ఎన్నికలే పునాదులు వేస్తాయి
    బస్సు యాత్రలో అన్ని వివరాలు ప్రచారం చేస్తున్నాయి.
    బీజేపీకి తెలంగాణలో గ్రౌండ్​ దొరకడం లేదు. అంత దొరికితే బీఆర్​ఎస్​ క్యాండిట్లను తీసుకున్నారు. బీబీ పాటిల్ ను తీసుకుని టికెట్లు తీసుకున్నారు. కిషన్​ రెడ్డి ఓడిపోతున్నాడు. కాంగ్రెస్ అనేక చోట్ల థర్డ్​ ప్లేస్​లో ఉంది.
    కేసీఆర్​ ప్రజ్వలంగా, ఉజ్వలంగా మళ్లీ వస్తాడు. సెకండ్ టైం 80 సీట్లు వస్తున్నాయి, 90 సీట్లు వస్తాయి.
    బీఆర్​ఎస్​ లో కేసీఆర్​ వారసుడు ఎవరూ. సమయం, సందర్భం తేలుస్తుంది. కేటీఆర్​, హరీష్​రావు ఉన్నారు. నేను ఎవ్వరిని ప్రోత్సహించాలేదు. ప్రాసెస్​ లో ప్రజల నుండి పార్టీ నుండి కావాలి.
    బీఆర్​ఎస్​ కార్యకర్తలకు చెప్పేదొకటే. కాంగ్రెస్​ నాయకులు వేధిస్తున్నారు. అద్భుతమైన పద్థతిలో మన పార్టీ వస్తది. ఉద్యమంలో అటుకులు బుక్కి పనిచేసినం,. జైళ్లకు వెళ్లినం. రేపు మనదే భవిష్యత్తు. ఎవరి స్థాయిలో వారు పనిచేయండి. సర్వేలు చూపిస్తున్న దాన్ని బట్టి 8 నుండి 12 సీట్లు గెలుస్తాం. తీక్షణంగా దాడులు జరిగితే అవసరమైతే కేసీఆర్​ వాలుతాడు. తెలంగాణ బాధ్యత తీరిపోలేదు. బంగారు తెలంగాణ తీర్చిదిద్దే వరకు ఉంటాం. భవిష్యత్తు మనదే.
    రేవంత్​రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ గంభీరంగా పనిచేయండి. శుభం కలుగాలని కోరుతున్నా.

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బిగ్​ స్క్రీన్​లలో ప్రజలు కేసీఆర్​ ఇంటర్వ్యూ చూశారు. నాలుగు గంటల పాటు జరిగింది. సాయంత్రం 7 గంటల నుండి 11 గంటల వరకు సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here