Revanth reddy : అడవి పందుల్లా బలిసిన బీఆర్ఎస్ నేతలు కెసిఆర్, కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

0
103

Revanth reddy :

గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని అడివి పందుల్లా కెసిఆర్భు, కేటీఆర్ బలిసారని సీఎం రేవంత్కాం రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​కు కంచుకోట భువనగిరి కోట అన్నారు.
-పదవుల్లో సామాజిక న్యాయం కల్పించాం
-రూ.50కోట్లతో ముసీ నది పున: నిర్మాణం
-ఎస్​ఎల్​బీసీ పూర్తి చేస్తా
-ఎన్నికల కోడ్​ అయిపోయిన తర్వాత
గుట్టపై కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరిస్తా
-యాదాద్రి కాకుండా యాదగిరి గుట్టగా పేరు పెట్టిస్తా
-టబుల్​ ఇంజన్​ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్​
జిల్లా, భువనగిరి ప్రాంతం అన్నా, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి,ఆ రుట్ల కమలారెడ్డి, ధర్మబిక్షం, కొండా లక్ష్మన్​బాబు , బెల్లి లలిత గుర్తు వస్తది.
మనుసు విప్పి మాట్లాడాలనుకున్నా…భూమికోసం భుక్తికోసం, విముక్తి కోసం పోరాడిన గడ్డ భువనగిరి అన్నారు. భువనగిరి కాంగ్రెస్​ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి నామినేషన్​ ర్యాలీలో పాల్గొని , అనంతరం కార్నర్​ మీటింగ్​లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మాట్లాడుతూ ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం చేసి, నిజాం, రజాకర్ల నుంచి విముక్తి కల్పించారు. బానిసత్వానికి అడ్డంగా నిలబడి దొరల గడీల నుంచి విముక్తి చేసింది. భువనగిరి కోట కాంగ్రెస్​కంచుకోట అని నిరూపించినందుకు అభినందనలు తెలిపారు. పోటీలో నిలబడ్డ వారు ఎవరు? వారి గుణగనాలు ఏంటీ? 2009లో యువకుడుగా రాజ్​గోపాల్​రెడ్డిని గెలిపిస్తే..ఢిల్లీ దద్దరిల్లేవిధంగా పార్లమెంట్​ను స్థంభింపచేసి 2014లో తెలంగాణ సాధించారు. కష్టాలు , నష్టాలు వచ్చినా, కన్నీరు కార్చినా సొంతంగా ఖర్చుచేసి, ఆస్తులు ఖర్చుపెట్టిన నేతల కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, తెలంగాణ సాధనలో పిల్లల ప్రాణాలు పోతుంటే కేసీఆర్​ రాజీనామా డ్రామాల మీద, ఎలక్షన్లు, కలెక్షన్లు ఆంద్రొళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. వెంకట్​రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి, చావుకోట్లో తలకాయ పెట్టి, అధిష్టానాన్ని ఎదురించి తెలంగాణ సాధించిండు. కొండా లక్ష్మన్​బాబుజీ త్యాగం చేసిండో, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అలాగే త్యాగం చేసిండన్నారు.





భూమికి మూరెడు లేడు, ఆ సన్యాసి దొరగారి గడీలో సారాలో సోడా పోసి రాజకీయాల్లోకి వచ్చిండో అలాకాదు కోమటిరెడ్డి బ్రదర్స్​ ప్రజల కోసం కొట్లాడి వచ్చిండంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పై ధ్వజమేత్తరు . నాలాగా సీఎంగా అర్హత ఉందంటే కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి ఉంది. సీఎం పదవిని బాధ్యతగా చూశానే తప్పా అహంకారంతో కూర్చొలే. రోజుకు 18 గంటలు పేదవారి అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నా. 60ఏళ్ల ఆకాంక్షతో వచ్చిన తెలంగాణ కేసీఆర్​ గడీల నుంచి విముక్తి కలిగించిండ్రు. సీఎం కాక ముందు నా ఇంటికి వచ్చి బాజప్త కలిసిండ్రో ఇప్పుడు కూడా అలాగే కలుస్తున్నారు .

ప్రగతిభవన్​ ప్రజల సొమ్ముతో కట్టింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేసిన సమయంలో గడీల గోడలు బద్దలు కొట్టి, ప్రజల కోసం తలుపులు తెరిచామన్నారు. అసవరం ఉన్నప్పుడల్లా కమ్యూనిస్టు సోదరుల కడుపులో దండంపెట్టి, వాడుకున్న తర్వాత కమ్యూనిస్టులను ఆదుకోలేదన్నారు. ఇండియా కూటమి కలిసిఉండాలని, నరేంద్రమోడీ నడుం విరగ్గొట్టాలని ముందుకు వచ్చారన్నారు. నరేంద్రమోడీ వ్యవస్థలు కుప్పకూల్చారు. ఈడీతో సహా అన్ని దేశాన్ని కుప్ప కూల్చారు. ఇండియా కూటమి రావాలి, రాహుల్​ ప్రధాని కావాలని కలిసి వచ్చామన్నారు. ఏ విషయాలున్నా మనం అందరం కొట్లాడుదాం. బీఆర్​ఎస్​కు ఒక్కసీటు వచ్చినా మోడీ వద్ద తాకట్టు పెడతారు. నోట్ల రద్దు, త్రిబుల్​ తలాఖ్​, రైతు చట్టాలతో పాటు మోడీకి కేడీ మద్దతు పలికారని రేవంత్​ ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ను ఓడించాలంటూ కేసీఆర్​ అంటుండు. ఎందుకు రూ.7లక్షల కోట్ల అప్పుల గడ్డగా, విద్యార్థుల ఆత్మహత్యలతో బొందల గడ్డగా మార్చిన నివ్వు. ఎందుకు ఓడగొడతావన్నారు. బీసీల జనాబా లెక్కింపు చేస్తున్నాం. అందుకా, ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలన్నాడు. కేసీఆర్​ ఇంట్లో వారికి, సుట్టపోళ్లందరికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పేపర్లను పల్లీ, బఠానీలకు పేపర్లు అమ్ముకున్నాడంటూ ఆరోపించారు.


పేదలకోసం 18గంటలు పనిచేస్తున్నాం​…
ఇందిరమ్మ రాజ్యంలో 90రోజుల్లోగా 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలంటున్నాడు. పేదొళ్లకు 30వేల ఉద్యోగాలు పేదొళ్లకు ఇచ్చామని ఇందుకా వోడగొట్టాలా?. మహిళలు ఆత్మగౌరవంతో తిరిగాలంటూ ఉచిత ప్రయాణం కల్పించాం. ఇందుకా ఓడగొట్టాలా? పేదొళ్లకోసం ఉచిత ఆరోగ్యం కోసం రూ.10 లక్షల ఇన్సూరెన్స్​ కల్పించాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ కేసీఆర్​ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్​రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.దిగిపో దిగిపో అంటున్నావ్… ఉత్తగ వచ్చామా బిడ్డా అని కేసీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఆగష్టు 15వ తేదీలోగా రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. మానుకోట కాంగ్రెస్ కంచుకోట అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ ప్రాంతం విధ్వంసమైందని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెచ్చిన చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారని అన్నారు. తండ్రి రెడ్యానాయక్‌ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకి లేదని చెప్పారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోదీ తెలంగాణను అవమాన పరిచారని ధ్వజమెత్తారు. అప్పుడు పార్లమెంట్‌లోతానే ప్రత్యక్ష సాక్షినని గుర్తుచేశారు. ఉత్తర భారతదేశంలోని కుంభమేళాకు మోదీ వేల కోట్లు ఖర్చు చేశారని.. మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.

మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్‌ను కేసీఆర్ మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేంద్ర మంత్రి పథవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో రైతులను మోదీ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆరోపించారు. 100రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, బీజేపీని అడుగుతున్నాం. సిలీండర్​ దీపం కింద సోనియమ్మ సిలీండర్​ ఇచ్చారు. నాడు రూ. 400 ఉంటే నేడు రూ.1200 సిలీండర్​ధరగా మోడీ, కేడీ చేసిండ్రు. 40లక్షల కుటుంబాలకు రూ.500లకే సిలీండర్​ ఇస్తున్నామన్నారు. డబుల్​ బెడ్​రూం ఇళ్లంటూ కథలు చెప్పి, ఊరించి, ఊరించిండు పేదొడికి డబుల్​ బెడ్​రూం ఇవ్వలేదన్నారు,.బిడ్డకు బెయిల్​ కావాలంటే భువనగిరిలో బీజేపీకి మద్దతు ఇవ్వాలంటున్నాడని, వీరి గారడి మాటలు వినొద్దన్నారు

.
భువనగిరిలో డబుల్​ ఇంజన్​ నేతలు…
కాంగ్రెస్​కు కోమటిరెడ్డి బ్రదర్స్​ డబుల్​ ఇంజన్ లాంటి వారని సీఎం తెలిపారు. భువనగిరి ప్రజలకు డబుల్​ ఇంజన్​కుతోడుగా చామల కిరణ్​కుమార్​రెడ్డిని గెలిపిస్తే త్రిబుల్​ ఇంజన్​ నేతలు మీ కోసం కృషిచేస్తారన్నారు. రూ.50కోట్లతో మూసీ బాగుచేయడం, బ్రాహ్మనవెళ్లం, ఎల్​బీసీ పూర్తి చేసే బాధ్యత నాదన్నారు. నల్గొండ ప్లొరైడ్​ కేసీఆర్​ పాపమేనన్నారు. ఎల్​ఎస్​బీసీని పండబెట్టింది నివ్వుకాదా? అని అన్నారు. నాలుగున్నరేళ్లలో పూర్తి కావాలంటే మీ తరపున సిపాయిని పంపాలంటే చామల కిరణ్​రెడ్డిని ఢిల్లీకి పంపాలి. అప్పుడు త్రిబుల్​ ఇంజన్​అయితది. యాదాద్రిని యాదగిరి గుట్ట గా పేరుంటది. ఎన్నికల కోడ్ పోగానే గుట్టపై కూర్చొని అందరి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. యాదగిరి గుట్ట లక్ష్మినర్సింహాస్వామి ఆనగా చెబుతున్నా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here