సెమికాన్ 2.0తో తెలంగాణకు భారీ అవకాశాలు.. రూ.724 కోట్ల EMC ప్రాజెక్టులు: కిషన్ రెడ్డి

0
3

SEMIKON 2.0:భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమికాన్ 2.0 పథకం తెలంగాణకు భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురానుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. రూ.1,27,500 కోట్ల వ్యయంతో అమలు కానున్న ఈ పథకం దేశాన్ని సెమీకండక్టర్ తయారీ, చిప్ డిజైన్ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలబెడుతుందని తెలిపారు.

మంత్రి విడుదల చేసిన ప్రకటనలో, సెమికాన్ 1.0లో భాగంగా తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (EMCs) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.724 కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

తెలంగాణలో కీలక ప్రాజెక్టులు

సెమికాన్ 1.0 కింద మంజూరైన ప్రాజెక్టులు:

  • ఈ-సిటీ, ఫ్యాబ్ సిటీ గ్రీన్‌ఫీల్డ్ EMC – రూ.252 కోట్లు
  • మహేశ్వరం గ్రీన్‌ఫీల్డ్ EMC – రూ.139 కోట్లు
  • హైదరాబాద్ కామన్ ఫెసిలిటీ సెంటర్ – రూ.75 కోట్లు
  • మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి EMC – రూ.258 కోట్లు

తెలంగాణలో 27 విద్యా సంస్థలకు ప్రోత్సాహం

ఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ హైదరాబాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ వరంగల్, జేఎన్‌టీయూ హైదరాబాద్, బిట్స్ హైదరాబాద్, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల సహా 27 విద్యా, పరిశోధనా సంస్థలు సెమీకండక్టర్ డిజైన్ శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయని మంత్రి తెలిపారు.

సెమికాన్ 2.0లో ఆరు ప్రధాన రంగాలు

ఈ పథకం ద్వారా:

  • చిప్ డిజైన్
  • సెమీకండక్టర్ మెటీరియల్స్
  • సిలికాన్, డిస్‌ప్లే ఫ్యాబ్స్
  • ATMP, OSAT యూనిట్లు
  • పరిశోధన & అభివృద్ధి (R&D)
  • టాలెంట్ డెవలప్‌మెంట్

రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించనున్నట్లు పేర్కొన్నారు.

మొబైల్ తయారీకి కొత్త ఊపు

రూ.62,500 కోట్లతో అమలు కానున్న మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (MPMS) ద్వారా దేశంలో మొబైల్ తయారీ, దేశీయ విలువ ఆధారిత ఉత్పత్తి, సప్లై చైన్ బలోపేతానికి ఊతం లభిస్తుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, సుమారు 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ యువతకు సువర్ణావకాశం

హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ రంగాల్లో అగ్రస్థానంలో ఉందని, సెమికాన్ 2.0తో సెమీకండక్టర్ తయారీ యూనిట్లు, ATMP ప్లాంట్లు, డిజైన్ సెంటర్లు, పరిశోధనా సంస్థలను ఆకర్షించే అవకాశాలు మరింత పెరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.

చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, క్లీన్‌రూమ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ వంటి ఆధునిక రంగాల్లో యువత నైపుణ్యాలు పెంపొందించుకుని ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్యాంశాలు

తెలంగాణ యువతకు ప్రపంచ స్థా

రూ.1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0

తెలంగాణకు రూ.724 కోట్ల EMC ప్రాజెక్టులు

27 విద్యా సంస్థల్లో సెమీకండక్టర్ డిజైన్ శిక్షణ

రూ.62,500 కోట్ల మొబైల్ తయారీ పథకం

దేశవ్యాప్తంగా 60 వేల కొత్త ప్రత్యక్ష ఉద్యోగాల లక్ష్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here