Cpm -congress :తెలంగాణ ఎన్నికల్లో సిపిఎం.. కాంగ్రెస్ పొత్తు

0
162

Cpm -congress :

-సీపీఎంతో కాంగ్రెస్​ దోస్తీ
-ఎన్నికల్లో పొత్తు ఖరారు
-మధ్యవర్తిత్వం వహించిన డిప్యూటీ సీఎం


కాంగ్రెస్​ పార్టీతో కలిసి పార్లమెంట్​ ఎన్నికల్లో పనిచేసేందుకు సీపీఎం పార్టీ ఒప్పుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో సీపీఎం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం చర్చలు జరిపారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య​ అవగాహన కుదిరింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో సఖ్యత కుదిరినట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని సీపీఎం నేతలు వెల్లడించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో లౌకికవాద పార్టీలు ఇండియా కూటమితో కలిసి పనిచేస్తూ లౌకికవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీపీఎం పార్టీ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా సీపీఎం పార్టీ రాష్ట్ర నేతలను కలిసి పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని అభ్యర్థించినట్లు వెల్లడించారు.భేటీలో జరిగిన చర్చల్లో ఇరువురి అభిప్రాయాలను పంచుకున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. సీపీఎం నాయకులు చెప్పిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లానని అనంతరం ఆ విషయాలను సీపీఎం నాయకులకు చెబుతానని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేయాలనే అంగీకారానికి మాత్రం రావడం జరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీగా తాను చెప్పాల్సిన విషయాలు సీపీఎం పార్టీ నేతలకు సూటిగా చెప్పడం జరిగిందని , వారి అభిప్రాయాను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here